ప్రాణదాతలు

కొందరు ఆటో డ్రైవర్లు వృద్ధులనూ రోగులనూ గర్భిణులనూ ఉచితంగా ఎక్కించుకుంటారు.  ఒడిశాలోని బ్రహ్మపుర పట్టణంలో అందుకోసం ఓ ఆటో డ్రైవర్ల బృందమే పని చేస్తుందంటే నమ్ముతారా! నలభై రెండేళ్ల గగన్‌ పాత్రో కొడుకు ఫిట్స్‌తో తీవ్రంగా అనారోగ్యం పాలయ్యాడు.

Published : 24 Mar 2024 01:11 IST

కొందరు ఆటో డ్రైవర్లు వృద్ధులనూ రోగులనూ గర్భిణులనూ ఉచితంగా ఎక్కించుకుంటారు.  ఒడిశాలోని బ్రహ్మపుర పట్టణంలో అందుకోసం ఓ ఆటో డ్రైవర్ల బృందమే పని చేస్తుందంటే నమ్ముతారా! నలభై రెండేళ్ల గగన్‌ పాత్రో కొడుకు ఫిట్స్‌తో తీవ్రంగా అనారోగ్యం పాలయ్యాడు. అర్ధరాత్రి పూట ఆ బాలుణ్ని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి వాహనాలేమీ దొరక్క ఎంతో ఇబ్బంది పడ్డాడు గగన్‌. ఆ సమయంలో విజయవాడకు చెందిన ఓ లారీ డ్రైవర్‌ లిఫ్ట్‌ ఇవ్వడంతో కొడుకు ప్రాణాలు కాపాడుకోగలిగాడు. ఏమీ ఆశించకుండా లారీ డ్రైవర్‌ సాయం చేసిన తీరుకు స్ఫూర్తి పొందిన గగన్‌ ఓ ఆటో కొనుక్కుని ఉపాధిని పొందడంతోపాటు... వృద్ధులకీ రోగులకీ గర్భిణులకీ యాక్సిడెంట్‌ అయినవారికీ ఉచితంగా సేవలందించాలని నిర్ణయించుకున్నాడు. తోటి ఆటో డ్రైవర్లతోనూ మాట్లాడి ఓ ముప్ఫై మందితో కలిసి యూనియన్‌ ఏర్పాటు చేశాడు. సాయం గురించి చెబుతూ ఫోన్‌ నంబర్లను ఆటో వెనక అంటించుకున్నారు ఆ డ్రైవర్లు. అత్యవసర పరిస్థితిలో ఉన్నవారెవరైనా వీళ్లను సంప్రదిస్తే వెంటనే స్పందించి ఆసుపత్రిలో చేర్పిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..