రెండో పెళ్లికి రూ.2లక్షలు!

భర్త చనిపోయిన చాలామంది ఆడవాళ్లు రెండో పెళ్లికి అస్సలు ఇష్టపడరు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒంటరిగానే పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంటారు 

Published : 24 Mar 2024 01:13 IST

భర్త చనిపోయిన చాలామంది ఆడవాళ్లు రెండో పెళ్లికి అస్సలు ఇష్టపడరు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒంటరిగానే పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంటారు. ఈ క్రమంలో తమ సుఖసంతోషాల గురించి ఎంత మాత్రం పట్టించుకోరు. పైగా సమాజం కూడా కొన్ని కట్టుబాట్ల పేరుతో రెండోపెళ్ళిని చిన్నచూపు చూస్తుంది. అలాంటి మహిళలకు భరోసా కల్పించాలనుకుంటున్న ఝార్ఖండ్‌ ప్రభుత్వం ‘విధ్వ పునర్వివాహ్‌ ప్రోత్సాహన్‌ యోజన’ పేరుతో వితంతువులు రెండో పెళ్లి చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. పెళ్లి చేసుకుని ఆ సర్టిఫికెట్‌నీ, చనిపోయిన భర్త మరణధ్రువీకరణ పత్రాన్నీ సమర్పిస్తే- వారి ఖాతాలో రెండు లక్షల రూపాయలు జమ చేస్తోంది. అయితే ఈ పత్రాలను పెళ్లైన ఏడాదిలోపే సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకీ, పెన్షన్లు తీసుకునేవారికీ ఈ పథకం వర్తించదు. ఏ అండా లేనివారిని ఆదుకోవాలనే ఈ నిర్ణయం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..