కూరల కాంబో ఇది!

కర్రీపాయింట్‌కి వెళ్లి కూరలు ఇవ్వమని అడగ్గానే ఓ ప్లాస్టిక్‌ కవరులో వేసి... దారంతో చుట్టిస్తారు. లేదంటే ఆ కవరునే ముడివేసి చేతిలో పెడతారు.

Published : 24 Mar 2024 01:15 IST

కర్రీపాయింట్‌కి వెళ్లి కూరలు ఇవ్వమని అడగ్గానే ఓ ప్లాస్టిక్‌ కవరులో వేసి... దారంతో చుట్టిస్తారు. లేదంటే ఆ కవరునే ముడివేసి చేతిలో పెడతారు. అదే ఆన్‌లైన్‌లో హోటల్‌ నుంచి ఆర్డరు పెట్టుకుంటే అల్యూమినియం ఫాయిల్‌ కవరులోనో ప్లాస్టిక్‌ డబ్బాలోనో కూరను ప్యాక్‌ చేసి ఇస్తారు. చెన్నైలోని మాంబలం ప్రాంతానికి చెందిన మనీష్‌ జైన్‌ మాత్రం ఆ కూరల్ని చక్కగా గాజు సీసాల్లో పెట్టి ఇస్తాడు. ఆ సీసాలను అలా చేతిలో పెట్టడం కాకుండా... వాటిని చక్కగా ప్యాకింగ్‌ చేసి అందిస్తుంటాడు. ‘కుళంబు బాక్స్‌’(కూర డబ్బా) పేరుతో ఓ షాపు పెట్టి కూరల్ని వైవిధ్యంగా అందిస్తున్న మనీష్‌- ఎవరైనా స్నేహితులకీ, కుటుంబసభ్యులకీ వాటిని బహుమతిగా కూడా ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాడు.ముందు రోజే ఏ కూరలు కావాలో చెబితే వాటిని గాజు సీసాల్లో పెట్టి కాంబో ప్యాక్‌ను సిద్ధం చేస్తాడు.ఎవరికి ఎక్కడ ఇవ్వాలో చెబితే చాలు డెలివరీ కూడా అందిస్తుంటాడు.ఎక్కడున్నా ఆత్మీయులకు నచ్చిన కూరలతో విందును ఏర్పాటు చేయొచ్చు కదా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..