రంజాన్‌ నెలంతా ఉచితం!

పుణ్యక్షేత్రాలకూ దర్శనీయ ప్రదేశాలకూ దగ్గర్లో ఉన్న హోటళ్లలో అద్దె ఎక్కువగానే ఉంటుంది.

Updated : 30 Mar 2024 23:34 IST

పుణ్యక్షేత్రాలకూ దర్శనీయ ప్రదేశాలకూ దగ్గర్లో ఉన్న హోటళ్లలో అద్దె ఎక్కువగానే ఉంటుంది. పండుగలూ, ఇతర పర్వదినాలప్పుడూ అదనంగా ఛార్జ్‌ చేస్తారు. పవిత్ర రంజాన్‌ మాసంలో రాజస్థాన్‌లోని అజ్మేర్‌ దర్గా కిటకిటలాడుతుంటుంది. ఎంత డబ్బు పోసినా అక్కడ హోటళ్లు దొరకడం చాలా కష్టం. ఆ ఇబ్బందులన్నీ పడలేక పేదవారు రోడ్డుపక్కనే నిద్రించడం, నమాజు చేసుకోవడం చూశాడు... దర్గా పరిసరాల్లో త్రీస్టార్‌ హోటల్‌ నడుపుతున్న ఆదిత్య గోయల్‌. దాదాపు పాతికేళ్లుగా హోటల్‌ రంగంలో ఉన్న ఆయన రంజాన్‌ మాసంలో పేదలకు ఉచితంగా రూములు ఇవ్వడంతోపాటు ప్రతిరోజూ ఇఫ్తార్‌ విందు కూడా ఏర్పాటు చేస్తుంటాడు. హోటల్‌కి బస కోసం వచ్చేవారు ఎక్కువగా ఉన్నప్పుడు సొంత ఖర్చులతో వేరేచోట వసతి కల్పించే ఆదిత్య.. వారికి దారి ఖర్చులు కూడా అందివ్వడం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు