బాతులు ఎగరావచ్చు!

బాతులు నడుచుకుంటూ వెళ్లడం, నీళ్లలో ఈదడం చూస్తుంటాం. అవి ఆకాశంలోకి రివ్వున ఎగరడం ఎప్పుడైనా చూశారా..

Published : 30 Mar 2024 23:35 IST

బాతులు నడుచుకుంటూ వెళ్లడం, నీళ్లలో ఈదడం చూస్తుంటాం. అవి ఆకాశంలోకి రివ్వున ఎగరడం ఎప్పుడైనా చూశారా.. ఇంత వరకూ చూసి ఉండకపోతే మాత్రం కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు దగ్గర్లో ఉన్న జెమీనా గ్రామంలో చూడొచ్చు. ఒకప్పుడు బాగా వెనకబడిన ఈ గ్రామం ప్రస్తుతం ఎగిరే బాతుల వల్లే ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. సాధారణంగా మన దగ్గరుండే దేశీ బాతులు ఎగరలేవు. జెమీనా గ్రామానికి చెందిన షౌకత్‌ అలీ దాదాపు ఆరు నెలలు కష్టపడి తన దగ్గరున్న వంద బాతులకు ఎగిరేలా ట్రైనింగ్‌ ఇచ్చాడు. ‘రెక్కలున్న పక్షులన్నీ ఎగురుతాయి. ఒక్క బాతులు మాత్రమే రెక్కలున్నా ఎందుకు ఎగరడం లేదు..’ అనుకున్న షౌకత్‌ గతేడాది వాటికి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. బాతులు బరువుగా ఉండటం, రెక్కలు ఫ్లెక్సిబుల్‌గా లేకపోవడం వల్ల ఎగరలేకపోతున్నాయని గుర్తించి- రెక్కలతో వ్యాయామాలు చేయించి ఎగరడం నేర్పించాడు. రెండు నెలలుగా బాతులు ఎగరడంతోపాటు దాడి చేయడానికి వచ్చిన కుక్కలూ, పిల్లలపైన ఎదురుదాడి చేయడం కూడా గమనించాడు షౌకత్‌. అతని దగ్గర ఎగిరే బాతుల్ని చూడ్డానికి పలువురు వస్తుండటంతోపాటు ఆ ఫ్లయింగ్‌ బాతుల్ని రెట్టింపు ధర ఇచ్చి మరీ కొనుక్కెళుతున్నారట. టూరిజంలో గ్రాడ్యుయేషన్‌ చేసిన ఈ కుర్రాడు మొత్తానికి ఇంట్లోనే సరికొత్త వ్యాపారాన్ని సృష్టించుకున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..