పెళ్లి చేసి ఆశ్రయమిస్తారు!

తోడబుట్టిన వాళ్లే ఒక మాట మీద ఉండట్లేదు ఈ రోజుల్లో. వందల ఏళ్లుగా కొన్ని కట్టుబాట్లు పెట్టుకుని ఊరంతా ఒకే తాటి మీదే నడుస్తోందంటే ఆశ్చర్యమే కదా.

Updated : 01 Apr 2024 13:04 IST

తోడబుట్టిన వాళ్లే ఒక మాట మీద ఉండట్లేదు ఈ రోజుల్లో. వందల ఏళ్లుగా కొన్ని కట్టుబాట్లు పెట్టుకుని ఊరంతా ఒకే తాటి మీదే నడుస్తోందంటే ఆశ్చర్యమే కదా. హిమాచల్‌ప్రదేశ్‌లోని పర్యటక ప్రాంతమైన ‘కులూ’కు దగ్గర్లో ఉంటుంది షాంగ్‌చుల్‌ గ్రామం. ఎన్నికల సమయంలో తప్ప ఆ గ్రామంలోకి పోలీసులను అడుగుపెట్టనివ్వరు. గొడవలకీ, వివాదాలకీ తావుండదు. మద్యపానం, ధూమపానం నిషేధం అక్కడ. ఎవరూ పెద్ద గొంతుతో మాట్లాడరు. వ్యవసాయమే జీవనాధారమైన ఆ గ్రామ సరిహద్దుల్లో మహదేవ్‌ ఆలయముంది. అక్కడ పెళ్లి చేసుకోవడానికి వచ్చిన ప్రేమికులకు పురోహితులూ గ్రామస్థులూ దగ్గరుండి పెళ్లి చేసి, వారికి ఆరు నెలలపాటు ఆశ్రయమూ కల్పిస్తారు. కోరుకున్న వారికి జీవనోపాధి కూడా చూపిస్తారు. పోలీసు కేసులూ, గొడవలూ లేకుండా ఆ దంపతుల కుటుంబసభ్యులతో మాట్లాడి వారిని సంతోషంగా సాగనంపుతుంటారు. మహాభారత కాలంలో కౌరవులకు భయపడిన పాండవులు మహదేవ్‌ ఆలయంలో తలదాచుకున్నారట. పాండవులకోసం ప్రత్యక్షమైన మహదేవుడు కౌరవుల్ని తరిమికొట్టి... తన దగ్గర ఆశ్రయం కోసం వచ్చినవారికి హాని చేయొద్దని  చెప్పాడట. అందుకని ఆ గ్రామస్థులు ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..