మొక్కుతీరితే బొమ్మలు!

తలనీలాలిస్తామనో, మోకాళ్లతో గుడి మెట్లెక్కుతామనో, పొర్లుదండాలు పెడతామనో, వెయ్యిన్నూట పదహార్లు చెల్లించుకుంటామనో- దేవుడి దగ్గర తమ కోరికలు విన్నవించుకుంటారు భక్తులు.

Published : 06 Apr 2024 23:20 IST

లనీలాలిస్తామనో, మోకాళ్లతో గుడి మెట్లెక్కుతామనో, పొర్లుదండాలు పెడతామనో, వెయ్యిన్నూట పదహార్లు చెల్లించుకుంటామనో- దేవుడి దగ్గర తమ కోరికలు విన్నవించుకుంటారు భక్తులు. తీరాక మొక్కులు చెల్లించుకుంటారు. కానీ ఆ ఆలయంలో మొక్కుగా బొమ్మల్నే చెల్లిస్తారు. పెళ్లయి ఎన్నేళ్లయినా కడుపు పండనివాళ్లు- పిల్లలు పుట్టాక తల్లీపిల్లల బొమ్మనీ, కుటుంబంలో కలహాలొచ్చి మళ్లీ కలిస్తే - భార్యాభర్తల జంట ప్రతిమల్నీ, తమవాడు ఇంజినీరో డాక్టరో అయితే ఆ విగ్రహాల్నీ ఇలా సమర్పించుకుంటారక్కడ. పుదుచ్చేరికి దగ్గర మన్నంబాక్కం అనే ఊళ్లో ఉంటుందీ గుడి. అళగు ముత్తు అళగర్‌ చిత్తర్‌ అన్న ఈ ఆలయంలో సుమారు 300 ఏళ్లుగా ఈ ఆచారం సాగుతోంది. గుడి చిన్నదే కానీ, దాని చుట్టూ రెండెకరాల మేర ఈ బొమ్మలే కొలువై ఉంటాయి. భక్తులు ఇంకెక్కడో బొమ్మల్ని చేయించక్కర్లేకుండా ఈ ఆలయ ప్రాంగణంలోనే వాటిని రూపొందించి అందించడానికి ప్రత్యేకంగా కళాకారులూ ఉంటారిక్కడ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..