పార్కులో రామాయణం!

పిల్లలకు చదువూ ఆటపాటలతో పాటు సంస్కృతీ సంప్రదాయాలనీ భారతీయ విలువల్నీ నేర్పించడానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించిన రామకృష్ణా మిషన్‌ ఓ సరికొత్త ప్రయోగం చేసింది.

Published : 13 Apr 2024 23:55 IST


పిల్లలకు చదువూ ఆటపాటలతో పాటు సంస్కృతీ సంప్రదాయాలనీ భారతీయ విలువల్నీ నేర్పించడానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించిన రామకృష్ణా మిషన్‌ ఓ సరికొత్త ప్రయోగం చేసింది. రామాయణ పేరుతో థీమ్‌ పార్కుని ఏర్పాటుచేసింది. రామకృష్ణా మిషన్‌ విద్యాలయ ఆధ్వర్యంలోని ఈ పార్కు కోయంబత్తూరు- ఊటీ హైవే పక్కన ఉంటుంది. లోపలికి ప్రవేశిస్తూనే ఎదురుగా హనుమంతుడి గుండెల్లో సీతారాములు కొలువై ఉన్న విగ్రహం కనిపిస్తుంది. హనుమంతుడి కోణం నుంచి రామాయణాన్ని అర్థం చేసుకోమని చెబుతుందిది. బయటికి విగ్రహంలా కనిపిస్తూనే పెద్ద గదిలా ఉండే దీని లోపలికి పిల్లలు వెళ్లి ఆడుకోవచ్చు. దశరథుడి పుత్రకామేష్టి యాగం, తాటక వధ, సీతా స్వయంవరం, శ్రవణ కుమారుడి చరిత్ర, సీతారాముల వనవాసం, పాదుకా పట్టాభిషేకం, బంగారుజింక వృత్తాంతం... ఇలాంటి ఘట్టాలన్నీ రంగుల చిత్రాలుగా, శిల్పాలుగా రూపుదిద్దుకున్నాయి. వీలుని బట్టి వాటిలోనే క్రీడల పరికరాలనూ అమర్చడంతో పిల్లలు ఆటలు ఆడుకుంటూనే రామకథనీ అర్థం చేసుకుంటున్నారు. ‘రామాయణ పార్కు’లోని ఈ చిత్రాలూ శిల్పాలూ పిల్లల్నీ పెద్దల్నీ కూడా ఆకట్టుకుంటున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..