బిడ్డను కంటే రూ.62 లక్షలు బోనస్‌!

పిల్లల్ని కంటే తల్లిదండ్రులకు జీతంతో కూడిన సెలవులు ఇవ్వడం అన్నిచోట్లా ఉన్నదే. దక్షిణ కొరియాకి చెందిన సంస్థ బూయాంగ్‌ గ్రూపు మరొకడుగు ముందుకేసి తన సిబ్బందికి ఏకంగా రూ.62 లక్షల నగదు(కొరియా కరెన్సీలో వంద మిలియన్‌ వన్లు) బోనస్‌గా చెల్లిస్తానని ప్రకటించింది.

Published : 13 Apr 2024 23:58 IST

పిల్లల్ని కంటే తల్లిదండ్రులకు జీతంతో కూడిన సెలవులు ఇవ్వడం అన్నిచోట్లా ఉన్నదే. దక్షిణ కొరియాకి చెందిన సంస్థ బూయాంగ్‌ గ్రూపు మరొకడుగు ముందుకేసి తన సిబ్బందికి ఏకంగా రూ.62 లక్షల నగదు(కొరియా కరెన్సీలో వంద మిలియన్‌ వన్లు) బోనస్‌గా చెల్లిస్తానని ప్రకటించింది. ఎంత మంది పిల్లల్ని కంటే అన్నిసార్లూ ఇంత మొత్తం ఇవ్వనుంది. ఎందుకలా అంటే- గత కొంతకాలంగా కొరియాలో యువత కెరీర్‌ యావలో పడి పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదట. ముఖ్యంగా మహిళలు పిల్లల కోసం కెరీర్‌ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. పిల్లల్ని పెంచడానికి అయ్యే ఖర్చు కూడా మరొక కారణం. దాంతో సంతాన సాఫల్యత రేటు (0.72) బాగా పడిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం చివరికల్లా దేశజనాభా సగానికి తగ్గిపోతుందట. దాంతో కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీపడి మరీ పిల్లల్ని కనే ఉద్యోగులకు బోనస్‌లు ప్రకటిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..