పదిహేడు జంటలు... ఒక్క కార్డు!

ఇటీవల రాజస్థాన్‌లోని బికనేర్‌ ప్రాంతంలో ఉన్న నౌఖా అనే ఊళ్లో ఉన్నవారందరికీ ఒక పెళ్లి శుభలేఖ అందింది. తెగబారెడు పొడుగున్న ఆ శుభలేఖని చదివి అర్థం చేసుకోవడానికి చాలా సమయమే పట్టింది గ్రామస్థులకి.

Published : 14 Apr 2024 01:20 IST

టీవల రాజస్థాన్‌లోని బికనేర్‌ ప్రాంతంలో ఉన్న నౌఖా అనే ఊళ్లో ఉన్నవారందరికీ ఒక పెళ్లి శుభలేఖ అందింది. తెగబారెడు పొడుగున్న ఆ శుభలేఖని చదివి అర్థం చేసుకోవడానికి చాలా సమయమే పట్టింది గ్రామస్థులకి. శుభలేఖలో ఏముంటాయి... వధూవరులూ వాళ్ల తల్లిదండ్రుల పేర్లూ, వివాహం ఎప్పుడు ఎక్కడ జరుగుతోందో ఆ వివరాలూ అంతేకదా... అంటున్నారా. మామూలుగా అయితే అంతే. కానీ ఈ శుభలేఖ నౌఖాకి చెందిన సూరజారామ్‌ ఇంటి నుంచి వచ్చింది. అలాగని ఆయనేమీ కవీ రచయితా కాదు, కాకపోతే సమష్టి కుటుంబానికి పెద్ద. ఆయనకి పెళ్లీడుకొచ్చిన మనవలూ మనవరాళ్లూ పదిహేడు మంది ఉన్నారట. ‘వాళ్లందరికీ విడివిడిగా పెళ్లిళ్లు చేయాలంటే ఈరోజుల్లో అయ్యే పనేనా, అందుకే ఒకేరోజు అందరి పెళ్లిళ్లూ చేసేశాం. అయిదుగురు అమ్మాయిలను అత్తారింటికి పంపాం. పన్నెండు మంది అబ్బాయిలకు వధువుల్ని తెచ్చుకున్నాం. అలా బంధుమిత్రులకీ ఊరివారికీ ఒక్కరోజు భోజనాలు పెట్టి పదిహేడు పెళ్లిళ్లూ అయ్యాయనిపించాం’ అంటూ అసలు విషయం చెప్పేశాడు సూరజారామ్‌. మరి పదిహేడు జంటల పేర్లూ వారి తల్లిదండ్రుల పేర్లూ రాస్తే శుభలేఖ ఎంత పొడుగ్గా ఉండాలీ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..