బంగారు కుల్ఫీ!

వేసవి కాలం రాగానే ఐస్‌క్రీములకూ కుల్ఫీలకూ డిమాండ్‌ బాగా పెరుగుతుంది. కానీ ఇందౌర్‌లోని ప్రకాశ్‌ కుల్ఫీవాలా షాపుకి మాత్రం ఏడాది పొడుగునా గిరాకీనే. అది కేవలం కుల్ఫీ షాపు కాదు, పర్యటకులకు సందర్శక ప్రాంతం కూడా.

Published : 14 Apr 2024 01:22 IST

వేసవి కాలం రాగానే ఐస్‌క్రీములకూ కుల్ఫీలకూ డిమాండ్‌ బాగా పెరుగుతుంది. కానీ ఇందౌర్‌లోని ప్రకాశ్‌ కుల్ఫీవాలా షాపుకి మాత్రం ఏడాది పొడుగునా గిరాకీనే. అది కేవలం కుల్ఫీ షాపు కాదు, పర్యటకులకు సందర్శక ప్రాంతం కూడా. కుల్ఫీ షాపులో అంతగా చూడడానికి ఏముంటాయీ అంటారా... రెండు కిలోల బంగారు ఆభరణాలను ధరించిన ఆ షాపు యజమానిని చూడడానికీ, 24 క్యారట్ల బంగారు ఫాయిల్‌తో అలంకరించి అతను తయారుచేసి ఇచ్చే కుల్ఫీ, ఫలూదాలను రుచి చూడడానికీ... సందర్శకులు క్యూకడతారట. వినియోగదారులు కోరిన ఫ్లేవర్‌ కుల్ఫీకి పైన గోల్డెన్‌ ఫాయిల్‌ చుట్టి ఇచ్చి పది రూపాయల కుల్ఫీని 350 రూపాయలకు అమ్ముతున్నాడు ప్రకాశ్‌. బంగారం అంటే తనకిష్టమనీ అందుకే తాను నగలు ధరించడమే కాక, కుల్ఫీకీ బంగారపు మెరుపులు అద్దుతున్నాననీ అనే ప్రకాశ్‌ తాను కుల్ఫీ ఖరీదు తీసుకోవడం లేదనీ బంగారానికి మాత్రమే తీసుకుంటున్నాననీ చెబుతాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు