ఆ గ్రామంలో పెళ్లి చేసుకోరు!

ఎన్నికల సమయంలోనూ, ఆలయాల్లోనూ, వినాయక ఉత్సవాల సందర్భంగానూ వీధికో మైకు మార్మోగిపోతుంటుంది. పెళ్లిళ్ల సమయంలో బరాత్‌, మంగళవాద్యాలూ, దీపావళి వేళ టపాసుల గురించైతే చెప్పక్కర్లేదు.

Published : 21 Apr 2024 00:05 IST

న్నికల సమయంలోనూ, ఆలయాల్లోనూ, వినాయక ఉత్సవాల సందర్భంగానూ వీధికో మైకు మార్మోగిపోతుంటుంది. పెళ్లిళ్ల సమయంలో బరాత్‌, మంగళవాద్యాలూ, దీపావళి వేళ టపాసుల గురించైతే చెప్పక్కర్లేదు. కర్ణాటకలోని బెళగావి జిల్లా అవరఖోడలో మాత్రం అలాంటి ఆర్భాటాలేమీ కనిపించవు. గ్రామమెప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది. పెళ్లిళ్ల సమయంలో మంగళవాద్యాలు ఏర్పాటు చేయాల్సి వస్తుందని ఊళ్లో వివాహాలు చేసుకోరు. చుట్టుపక్కల గ్రామాల్లోనే వేడుకలన్నీ జరుపుకుంటారు. కులవృత్తులైన కుమ్మరి, కమ్మరి, వడ్రంగి వాళ్లు సైతం గ్రామం వెలుపలే తమ పనులు చేసుకుంటారు. అయినా ఊరంతా ఎందుకు నిశ్శబ్దాన్ని పాటిస్తోందీ అనుకుంటున్నారు కదూ... అవరఖోడలోని ఆలయంలో కొలువైన హనుమంతుడు తపస్సులో ఉన్నాడనీ, ఆయన ఏకాగ్రతకు భంగం కలిగించకూడదనీ ఆ ఊళ్లో ఎలాంటి శబ్దాలూ చేయరు. ఆరొందల కుటుంబాలు నివాసముండే ఆ గ్రామంలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, టీవీలు చూస్తారు తప్ప మరేవిధమైన శబ్దాలూ రాకుండా జాగ్రత్తపడతారు. ఒకవేళ ఎవరైనా సౌండ్‌ చేస్తే వారికి చెడు జరుగుతుందని భావించే గ్రామస్థులు దీపావళినీ, ఇతర వేడుకల్నీ కూడా దూరం పెట్టి మౌనంగా దైవారాధన చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు