ఎండల్లో చల్లన...

రోడ్ల పైన రద్దీని నియంత్రిస్తూ.... ఎక్కడ ఏ సమస్య వచ్చినా చూసుకుంటారు ట్రాఫిక్‌ పోలీసులు. మండే ఎండల్లో కాలుష్యాన్నీ, వేడినీ తట్టుకుంటూ చెమటలు కక్కుతూ గంటలు గంటలు రోడ్లపైనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

Published : 21 Apr 2024 00:08 IST

రోడ్ల పైన రద్దీని నియంత్రిస్తూ.... ఎక్కడ ఏ సమస్య వచ్చినా చూసుకుంటారు ట్రాఫిక్‌ పోలీసులు. మండే ఎండల్లో కాలుష్యాన్నీ, వేడినీ తట్టుకుంటూ చెమటలు కక్కుతూ గంటలు గంటలు రోడ్లపైనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కానీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మాత్రం ట్రాఫిక్‌ పోలీసులు ఎండలో కూడా హాయిగా నిలబడి తమ పనులు తాము చేసుకుంటారు. మచ్చుకైనా అలసట వారి ముఖంలో కనిపించదు. దీనంతటికీ కారణం వారు ధరించిన ఏసీ హెల్మెట్లు. ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ, తలకీ ముఖానికీ చల్లదనాన్ని అందిస్తూ... గాలిని శుద్ధి చేస్తుందది. నోయిడాకు చెందిన ఓ స్టార్టప్‌ రూపొందించిన ఈ ఏసీ హెల్మెట్లు ఎనిమిది గంటలపాటు బ్యాటరీతో నడుస్తాయి. గుజరాత్‌ ట్రాఫిక్‌ సిబ్బంది ఈ హెల్మెట్లు పెట్టుకుని ఎండల్లో చల్లచల్లగా పని చేసుకుంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..