రామబాణంపై నడిచేయొచ్చు!

పర్యటక ప్రదేశమైన చిత్రకూట్‌... శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన ప్రదేశంగా చెబుతారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆ ప్రాంతంలో వనవాస కాలంలో సీతారామ లక్ష్మణులు తలదాచుకోవడమే అందుకు కారణమట.

Published : 21 Apr 2024 00:09 IST

ర్యటక ప్రదేశమైన చిత్రకూట్‌... శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన ప్రదేశంగా చెబుతారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆ ప్రాంతంలో వనవాస కాలంలో సీతారామ లక్ష్మణులు తలదాచుకోవడమే అందుకు కారణమట. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే ఆ ప్రదేశంలో ఉంటుంది కోదండ వనం. ఆ అటవీ ప్రాంతంలో తులసి జలపాతమొకటి పర్యటకుల్ని ఆకట్టుకుంటుంది. ఇప్పుడు అక్కడే నలభై అడుగుల ఎత్తులో విల్లు, బాణం ఆకృతిలో ఓ గ్లాసు బ్రిడ్జిని నిర్మించింది ఆ రాష్ట్ర పర్యటక శాఖ. అంత ఎత్తులో నిల్చుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మరి పారదర్శకంగా ఉండే ఆ రామబాణంపైన నిల్చుంటే కాళ్ల కింద జలపాతం జాలువారుతూ చూడ్డానికి ఎంతో బాగుంటుందట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..