ఆ ఊళ్ల పేర్లు... మామిడి!

స్థానికంగా ప్రాధాన్యం సంతరించుకున్న వాటి పేరును గ్రామాలకు పెట్టడం మనకు తెలుసు... వేసవిలో పిన్నల నుంచీ పెద్దల వరకూ ఇష్టపడే మామిడి పండు పేరునే ఏకంగా ఓ నలభై గ్రామాలకు పెట్టేసుకున్నారు ఒడిశావాసులు.

Published : 21 Apr 2024 00:11 IST

స్థానికంగా ప్రాధాన్యం సంతరించుకున్న వాటి పేరును గ్రామాలకు పెట్టడం మనకు తెలుసు... వేసవిలో పిన్నల నుంచీ పెద్దల వరకూ ఇష్టపడే మామిడి పండు పేరునే ఏకంగా ఓ నలభై గ్రామాలకు పెట్టేసుకున్నారు ఒడిశావాసులు. ఒడియాలో మామిడిని అంబ అంటారు. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న  ఆ రాష్ట్రంలోని మల్కన్‌గిరి, కోరాపుట్‌, నబరంగాపుర జిల్లాల్లోని చాలా గ్రామాలు వందల ఏళ్లుగా మామిడి తోటలూ, ఆ ఉత్పత్తుల మీదే ఆధారపడి బతుకుతున్నాయి. జీవనోపాధికి మూలమైన మామిడి మీద ఇష్టంతోనే ఆ జిల్లాల్లోని చాలా గ్రామాలు పేరుకు ముందో వెనకో ‘అంబ’ అనే పదాన్ని చేర్చుకున్నాయి. హతియాంబ, అంబపద, మంత్రియాంబ, మాచియాంబ, కంకదాంబ, అంబగూడ, జడంబా... ఇలా దాదాపు నలభై గ్రామాల సరసన మామిడి చేరిపోయిందన్నమాట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..