గోల్డ్‌గప్పా!

పానీపూరీ... పేరు వింటేనే చాలామందికి నోరూరిపోతుంది. రకరకాల స్టఫింగ్‌లతోనూ వెరైటీ మసాలా నీళ్లతోనూ వీధి చివరన అలరిస్తుంటుంది.

Published : 27 Apr 2024 23:55 IST

పానీపూరీ... పేరు వింటేనే చాలామందికి నోరూరిపోతుంది. రకరకాల స్టఫింగ్‌లతోనూ వెరైటీ మసాలా నీళ్లతోనూ వీధి చివరన అలరిస్తుంటుంది. ఇప్పుడు బంగారం, వెండి పూతలను అద్దుకుని మార్కెట్‌లో సరికొత్తగా లభిస్తోంది పానీపూరీ. డ్రైఫ్రూట్‌ పలుకులూ, తేనె స్టఫింగ్‌కు తోడు... తీయని పాల మిశ్రమాన్ని నింపిన గోల్‌గప్పాలకు బంగారు, వెండి పూతను అలంకరించి సర్వ్‌ చేస్తున్నారు... అదీ బంగారూ వెండి ప్లేట్లలోనే. అహ్మదాబాద్‌లోని పలు చోట్లా, ఎయిర్‌పోర్ట్‌లలోనూ లభించే ఈ తియ్యని పానీపూరీకోసం జనాలు బారులు తీరుతున్నారు. విదేశీయుల్నీ ఆకట్టుకుంటున్న ఈ ఖరీదైన పానీపూరీ ఒక్కసారి తిన్నా చాలంటున్నారు ఆహారప్రియులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..