వేగం, నిదానం... ఏవీ వద్దు!

సంతోష సమయంలో పెద్ద పెద్ద సౌండ్లతో పాటలు, లేదంటే మ్యూజిక్‌ పెట్టి డాన్స్‌లు చేయడం చాలామందికి అలవాటు. పెళ్లిళ్లూ, ఇతర శుభకార్యాల్లోనూ అందుకే సంగీత్‌ భాగమైంది.

Published : 27 Apr 2024 23:57 IST

సంతోష సమయంలో పెద్ద పెద్ద సౌండ్లతో పాటలు, లేదంటే మ్యూజిక్‌ పెట్టి డాన్స్‌లు చేయడం చాలామందికి అలవాటు. పెళ్లిళ్లూ, ఇతర శుభకార్యాల్లోనూ అందుకే సంగీత్‌ భాగమైంది. ఇలాంటి కార్యక్రమాల్లోనూ, హోటళ్లలోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ జరిగే వేడుకల్లో ఎవరికి ఇష్టమైనంత సౌండ్‌ను వారు పెట్టుకుంటారు. అందుకు సంబంధించి ఎక్కడా నిబంధనలేమీ ఉండవు. అయితే రష్యాలో భాగమైన చెచెన్యాలో మాత్రం ఎక్కువ శబ్దంతోనూ లేదంటే తక్కువ శబ్దంతోనూ మ్యూజిక్‌ను పెట్టడానికి వీల్లేదు. అలా చేస్తే జరిమానా కట్టాల్సి ఉంటుంది. శబ్దకాలుష్యాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో చెచెన్యా రిపబ్లిక్‌్ ఈ మధ్యనే ఆ నిబంధనను తీసుకొచ్చింది. అలాగని మరీ తగ్గించి... జనాల వినోదాన్ని అడ్డుకున్నా సరే ఫైన్‌ కట్టాల్సిందేనట. వెస్టర్న్‌ డాన్స్‌నీ, సంగీతాన్నీ కూడా అక్కడ ప్రదర్శించడానికి వీల్లేదు. అంటే రాక్‌, డిస్కో, పాప్‌ ఇకమీదట అక్కడ వినిపించవు. వాటికి భిన్నంగా మంద్రంగా ఉండే సరికొత్త సంగీతాన్ని కంపోజ్‌ చేయడానికి ఆ రిపబ్లిక్‌ రెండునెలల సమయం కూడా ఇచ్చింది. ప్రజల మనసును అర్థం చేసుకుని వారి ఆలోచనలకు అనుగుణంగా ఉండే సంగీతాన్ని మాత్రమే చెచెన్యా రిపబ్లిక్‌లో వినిపించాలనేది అక్కడి ప్రభుత్వం నిర్ణయం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..