ఊరంతా ఊడ్చాకే...

పల్లెల్లో ఉదయాన్నే లేవగానే ఎవరి వాకిళ్లు వాళ్లు శుభ్రం చేసుకుంటుంటారు. కేరళలోని ప్రమదోమ్‌ పంచాయతీకి చెందిన సుధీశ్‌ కుమార్‌ మాత్రం లేవగానే ఇంటి పరిసరాలతోపాటు గ్రామంలోని రోడ్లన్నీ ఊడ్చాకే దినచర్య మొదలుపెడతాడు.

Published : 27 Apr 2024 23:58 IST

ల్లెల్లో ఉదయాన్నే లేవగానే ఎవరి వాకిళ్లు వాళ్లు శుభ్రం చేసుకుంటుంటారు. కేరళలోని ప్రమదోమ్‌ పంచాయతీకి చెందిన సుధీశ్‌ కుమార్‌ మాత్రం లేవగానే ఇంటి పరిసరాలతోపాటు గ్రామంలోని రోడ్లన్నీ ఊడ్చాకే దినచర్య మొదలుపెడతాడు. ఎన్నికల సమయం కాబట్టి ఊరంతా ఊడ్చేసి మార్కులు కొట్టేసే రాజకీయనాయకుడేమో అనుకుంటారేమో కానీ అతనో సామాన్య రైతు. దాదాపు పదేళ్లుగా ఏమీ ఆశించకుండా బాధ్యతగా గ్రామాన్నీ, పరిసరాల్నీ పరిశుభ్రంగా ఉంచడంతోపాటు... మూగజీవుల్నీ ఆదరిస్తుంటాడు. అటవీశాఖాధికారిగా పనిచేసిన తండ్రి స్ఫూర్తితో మూగజీవులకు సేవ చేయడంతోపాటు పుట్టి పెరిగిన ఊరికోసం తనవంతుగా ఏదైనా చేయాలని పరిసరాలను శుభ్రం చేస్తున్న సుధీశ్‌ అంటే గ్రామస్థులకు ఎంతో అభిమానం. ఆయన మాటంటే గౌరవం. అందుకే ఎన్నికల వేళ గ్రామమంతా ప్రచారం చేయడానికి బదులు రాజకీయ నాయకులు ఓట్ల కోసం సుధీశ్‌ ఒక్కరింటికే వెళ్లి ఆయన మద్దతు కోరుతుంటారట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..