గూడంటే గూడూ కాదు...

బస్టాండ్‌లో ఎవరైనా బస్సులకోసం ఎదురు చూస్తుంటారు. ఒకవేళ బస్సులు ఎంతకీ రాకపోతే పక్కన వాళ్లతో మాట్లాడటమో, ఫోన్‌ చూసుకోవడమో చేస్తుంటారు.

Published : 28 Apr 2024 00:00 IST

స్టాండ్‌లో ఎవరైనా బస్సులకోసం ఎదురు చూస్తుంటారు. ఒకవేళ బస్సులు ఎంతకీ రాకపోతే పక్కన వాళ్లతో మాట్లాడటమో, ఫోన్‌ చూసుకోవడమో చేస్తుంటారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ప్రయాణికులు మాత్రం అలా చేయరు. కూర్చుని శ్రద్ధగా పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు. పుస్తకాలు చదువుకుంటే బస్సు వెళ్లిపోతుందేమో అనుకోవచ్చు... అందుకే ఆ బస్టాపులో బస్సులు కాసేపు ఆగి మరీ చదువుకునేవారిని ఎక్కించుకుంటాయి. పుస్తకాలు చదివే వారి సంఖ్య తగ్గిపోయిందనీ, చాలామంది ఇళ్లలో అసలు పుస్తకాలే ఉండట్లేదనే ఉద్దేశంతో ఆ జిల్లా కలెక్టర్‌ కుమార పల్లెటూరి బస్టాండ్లలో ‘పుస్తక గూడు’ పేరుతో లైబ్రరీలను ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. గతేడాది నుంచి బస్టాండ్లను అభివృద్ధి చేయడంతోపాటు పుస్తకాలనూ అందుబాటులో ఉంచుతూ పిల్లల్నీ పెద్దల్నీ చదివించే ప్రయత్నం చేస్తూ ఇప్పటి వరకూ దాదాపు 300 ప్రాంతాల్లో పుస్తక గూళ్లను ఏర్పాటు చేశారు. వాటిలో జనరల్‌ నాలెడ్జీ, చరిత్ర, టెక్నాలజీ, కథలూ, నవలలూ, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలెన్నో ఉంచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..