హ్యారీ ప్రపంచమిది!

ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకాల్లో ఒకటి హ్యారీ పాటర్‌.

Published : 04 May 2024 23:33 IST

ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకాల్లో ఒకటి హ్యారీ పాటర్‌. హ్యారీతోపాటు మనల్నీ మాయా లోకానికి తీసుకెళ్లి ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన ఈ నవల- ఎనిమిది సిరీస్‌లుగా వెండి తెరమీదకూ వచ్చి అన్ని వయసుల వారినీ ఆకట్టుకుంది. నవలల్లోనూ, తెరపైనా మనకు చూపిన ఆ అద్భుత ప్రపంచాన్ని ఇప్పుడు నిజంగానే సృష్టించారు. హ్యారీ పాటర్‌లోని మాయా ప్రపంచాన్నీ, మాంత్రికుణ్నీ, మంత్ర దండాన్నీ, వింత జీవుల్నీ, ఎగిరే గుర్రంతోపాటు అబ్బురపరిచే వింతలెన్నింటినో చూడాలంటే- ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లోని హ్యారీపాటర్‌ ఫోర్బిడెన్‌ పార్కుకు వెళ్లాల్సిందే. ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఏర్పాటు చేసిన ఈ మాయా ప్రపంచంలో విహరించి సరికొత్త అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..