పొంగళ్లు ప్రత్యేకం!

కోరిన కోర్కెలు తీరినప్పుడో, ప్రత్యేక సందర్భాల్లోనో, ఆలయ ఉత్సవాల్లో భాగంగానో- మహిళలు పొంగళ్లు చేసి దేవుడికి నివేదించడం అన్ని ఆలయాల్లోనూ చూస్తుంటాం.

Published : 04 May 2024 23:35 IST

కోరిన కోర్కెలు తీరినప్పుడో, ప్రత్యేక సందర్భాల్లోనో, ఆలయ ఉత్సవాల్లో భాగంగానో- మహిళలు పొంగళ్లు చేసి దేవుడికి నివేదించడం అన్ని ఆలయాల్లోనూ చూస్తుంటాం. అన్నమయ్య జిల్లా తిప్పాయపల్లెలోని శ్రీసంజీవరాయ స్వామి ఆలయ ప్రాంగణంలో మాత్రం మగవాళ్లే పొంగళ్లు చేస్తూ కనిపిస్తారు. ఆ పొంగలిని వాళ్లే తలమీద పెట్టుకుని ఊరంతా తిరిగాక స్వామికి సమర్పిస్తారు. వ్యవసాయం, పశుపోషణే జీవనాధారమైన ఆ ప్రాంతంలో ఐదొందల ఏళ్ల క్రితం కరవు వచ్చిందట. పశువులూ వ్యాధులపాలై మృత్యువాత పడ్డాయట. ఆ సమయంలో గ్రామానికి వచ్చిన ఓ సాధువు ప్రజల కష్టాలను తొలగించాలనే ఉద్దేశంతో బీజాక్షరాలను లిఖించిన ఓ శిలను ప్రాణప్రతిష్ఠ చేశాడట. అప్పట్నుంచీ ఆ శిలను సంజీవరాయ స్వామిగా ఆరాధిస్తూ- మగవారు పొంగళ్లు చేయడం మొదలుపెట్టాక ఆ గ్రామంలో సమస్యలన్నీ దూరమ య్యాయట. అందుకే ఇప్పటికీ ఆ ఆచారాన్ని కొనసాగిస్తూ ప్రతి ఆదివారం సంజీవరాయుడి చెంత మొక్కులు తీర్చుకునే భక్తులు కనిపిస్తారు. చుట్టుపక్కల రైతులతోపాటు పొరుగు రాష్ట్రాల భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుంటారు.

వి.వీరగంగాధర శర్మ, కడప డెస్క్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..