పుచ్చకాయల గంగ!

ఏ మార్కెట్‌కైనా లారీల్లోనో ట్రక్కుల్లోనో పండ్లను లోడ్‌ చేయడం చూస్తుంటాం.

Published : 04 May 2024 23:36 IST

మార్కెట్‌కైనా లారీల్లోనో ట్రక్కుల్లోనో పండ్లను లోడ్‌ చేయడం చూస్తుంటాం. పెద్ద ఎత్తున పడవల్లో పుచ్చకాయలను లోడ్‌ చేయడం ఎప్పుడైనా చూశారా. వేసవి వచ్చిందంటే చాలు... పుచ్చకాయల పడవల తోనూ, వాటిని కొనే వ్యాపారులతోనూ కిటకిటలాడుతుంటుంది ధాకాలోని బూరిగంగా నది ఒడ్డు. నగరంలోని ఒక పక్కన ప్రవహించే బూరిగంగను ఆనుకుని ఉన్న వందలాది గ్రామాల ప్రజలు పండ్లతోటలే జీవనాధారంగా జీవిస్తుంటారు. వేసవిలో విరివిగా పండే పుచ్చకాయలను నాటు పడవల్లో నగరానికి తరలించి వ్యాపారులకు అమ్మేస్తుంటారు. బూరిగంగా నది ఒడ్డునున్న మార్కెట్‌ బంగ్లాదేశ్‌లోని అతి పెద్ద మార్కెట్లలో ఒకటిగా చెబుతారు. పుచ్చకాయలతో పచ్చరంగును పులుము కున్నట్టుండే బూరిగంగా నదీతీరాన్ని చూడ్డానికి పర్యటకులు కూడా వెళ్లడం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు