చదివించే హోటల్‌!

సాధారణంగా హోటల్‌కి వెళ్లగానే ముందుగా ప్లేట్లూ, చెంచాలూ, ఫోర్కులూ టేబుల్‌పైన పెట్టి తరవాత ఆర్డర్‌ అడిగి తీసుకుంటారు.

Published : 04 May 2024 23:38 IST

సాధారణంగా హోటల్‌కి వెళ్లగానే ముందుగా ప్లేట్లూ, చెంచాలూ, ఫోర్కులూ టేబుల్‌పైన పెట్టి తరవాత ఆర్డర్‌ అడిగి తీసుకుంటారు. నాసిక్‌లోని ఓజర్‌ ప్రాంతంలోని ఓ హైవే పక్కనే ఉన్న ‘పుస్తకాంచల్‌’ అనే హోటల్‌కి వెళ్లగానే టేబుల్‌పైన కొన్ని పుస్తకాలు ఉంచుతారు. ఇష్టమైన పుస్తకాలేంటో అడిగి వెంటనే తెచ్చిస్తారు. ఆర్డరిచ్చిన ఐటమ్స్‌ వచ్చే వరకూ కస్టమర్లు ఎంచక్కా వాటితో కాలక్షేపం చేయొచ్చు. రుచికరమైన ఆహారంతోపాటు సాహిత్యాన్నీ అందిస్తున్న ఆ హోటల్న్‌ు నడిపేది సాహితీవేత్తనో లేక విద్యావేత్తనో అనుకుంటే పొరపాటే. ఓనమాలు కూడా చదువుకోని డెబ్భై నాలుగేళ్ల భీంబాయి. చదువుకు ప్రాణమిచ్చే ఆమెను తల్లిదండ్రులు చదివించకపోగా, ఓ తాగుబోతు చేతిలో పెట్టారు. భర్త ఇబ్బందులు పెట్టినా పిల్లల్ని  కష్టపడి చదివించింది. వాళ్లు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డాక భీంబాయి ఓ హోటల్‌ను ప్రారంభించి- ఆసక్తికొద్దీ పుస్తకాలనూ అందుబాటులో ఉంచుతోంది. ఇప్పుడక్కడ నవలలూ, కథలూ, చిన్నారుల పుస్తకాలూ, ఆత్మకథలూ తదితర పుస్తకాలన్నీ కలిపి దాదాపు ఐదువేల దాకా ఉన్నాయి. హోటల్‌కి వెళ్లిన వాళ్లు కావల్సినవి చదువుకోవచ్చూ... ఇంటికీ తెచ్చుకోవచ్చూ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..