వారికే సంబంధాలు

ఆధ్యాత్మిక భావనలు ఉన్నవారు తమలానే భాగస్వామి కూడా పూజలూ ఉపవాసాలూ తీర్థయాత్రలూ చేయాలని కోరుకోవడం సహజమే. అయితే- పెరిగిన వాతావరణం, వ్యక్తిగత అభిరుచుల వల్ల కొందరు అలాంటివి ఇష్టపడకపోవచ్చు.

Published : 12 May 2024 00:06 IST

ధ్యాత్మిక భావనలు ఉన్నవారు తమలానే భాగస్వామి కూడా పూజలూ ఉపవాసాలూ తీర్థయాత్రలూ చేయాలని కోరుకోవడం సహజమే. అయితే- పెరిగిన వాతావరణం, వ్యక్తిగత అభిరుచుల వల్ల కొందరు అలాంటివి ఇష్టపడకపోవచ్చు. ఆపాటిదానికే చాలామంది జీవితభాగస్వామితో గొడవలు పడుతుంటారు. ఆధ్యాత్మిక దారిలోకి రావాలని పోరు పెడుతుంటారు. కావడానికి ఇది చిన్నవిషయమే అయినా ఇంట్లో వాతావరణం భార్యాభర్తలకు ఇబ్బందికరంగానే ఉంటుంది. అలాంటివారికోసమే ఉంది యోగిక్‌షాదీ.కామ్‌. కులమతాలతో సంబంధం లేకుండా ఆధ్యాత్మిక భావాలు కలిగిన వారికీ, యోగా,ధ్యానం చేసేవారికీ తగిన లైఫ్‌పార్ట్‌నర్‌ని వెతికిపెడుతోంది ఈ వెబ్‌సైట్‌. తమకు పెళ్లి సంబంధాలు చూస్తున్న క్రమంలో కేవలం కులాల పరంగా పెళ్లిళ్లు కుదిర్చే సైట్లు మాత్రమే ఉండటం, యోగా, ధ్యానాలకు ప్రాధాన్యమిచ్చేవి లేకపోవడంతో- రెండేళ్ల క్రితం ఈ వెబ్‌సైట్‌కు రూపకల్పన చేశారు కోయంబత్తూరుకు చెందిన రాకేశ్‌, లావణ్య దంపతులు. చాలావరకూ వీళ్లు వ్యక్తిగత అభిరుచులకు ప్రాధాన్యమిస్తూ కట్నకానుకల ఊసు లేకుండా పెళ్లిళ్లు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..