దేశభక్తుల ఆలయం!

ఆలయగోడలపైన చక్కగా చెక్కిన దేవతామూర్తుల శిల్పాలూ, ఆయా పౌరాణిక గాధల్లోని ఘట్టాలూ దర్శనమివ్వడం సహజమే. కర్ణాటకలోని రాయ్‌చూర్‌ జిల్లా మున్నూర్‌వాడీలో ఉన్న లక్ష్మీదేవి ఆలయంలో మాత్రం గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఉంటుంది.

Published : 12 May 2024 00:08 IST

లయగోడలపైన చక్కగా చెక్కిన దేవతామూర్తుల శిల్పాలూ, ఆయా పౌరాణిక గాధల్లోని ఘట్టాలూ దర్శనమివ్వడం సహజమే. కర్ణాటకలోని రాయ్‌చూర్‌ జిల్లా మున్నూర్‌వాడీలో ఉన్న లక్ష్మీదేవి ఆలయంలో మాత్రం గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఉంటుంది. బయట స్తంభాలపైన మాత్రం గాంధీ, నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్‌ తదితర స్వాతంత్య్ర సమరయోధుల ప్రతిమలూ, అశోక చక్రం కనిపిస్తాయి. గర్భగుడిలోని మూలవిరాట్‌తోపాటు.... స్తంభాలకున్న ఆ ప్రతిమలకీ కుంకుమా, పూలూ పెట్టి ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తారు. రాయ్‌చూర్‌లో స్థిరపడిన తెలుగువారు 1959లో కట్టించిన ఈ ఆలయంలో దేవుడితోపాటు... ప్రాణాలకు తెగించి పోరాడి స్వాతంత్య్రం తీసుకొచ్చిన నాయకులనూ పూజించాలని గోడలపైన ప్రముఖుల రూపాలని చెక్కారు. అక్కడ స్థిరపడిన దాదాపు మూడొందల కుటుంబాల వాళ్లంతా తలోచేయి వేసి నిర్మించుకున్న ఈ లక్ష్మీ ఆలయంలో ఆధ్యాత్మికత వెల్లివిరియడంతోపాటు దేశభక్తీ పొంగిపొర్లుతుంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..