లండన్‌లో కేరళ అందాలు!

లండన్‌ వీధుల్లో కేరళలోని బ్యాక్‌ వాటర్స్‌పైన ప్రయాణించే పడవలు దూసుకుపోతున్నాయి. కొబ్బరి తోటలూ, కొండప్రాంతాల్ని కప్పేసినట్టున్న మున్నార్‌ టీ తోటలు ఆకట్టుకుంటున్నాయి.

Published : 12 May 2024 00:10 IST

లండన్‌ వీధుల్లో కేరళలోని బ్యాక్‌ వాటర్స్‌పైన ప్రయాణించే పడవలు దూసుకుపోతున్నాయి. కొబ్బరి తోటలూ, కొండప్రాంతాల్ని కప్పేసినట్టున్న మున్నార్‌ టీ తోటలు ఆకట్టుకుంటున్నాయి. నృత్యకారులు కథకళి భంగిమలతో కనువిందు చేస్తున్నారు. అయినా పరాయి దేశంలో కేరళ అందాలు రోడ్డుపైకి ఎలా వస్తాయనే సందేహం రావొచ్చు... అక్కడి పబ్లిక్‌ రవాణాలో భాగమైన డబుల్‌ డెక్కర్‌ బస్సులపైన ఆ సుందర దశ్యాల్ని ఆవిష్కరించి లండన్‌ ప్రజలకు కొత్త అనుభూతిని కలిగిస్తున్నారు. పర్యటకుల్ని ఆకట్టుకునే క్రమంలో కేరళ పర్యటక శాఖ లండన్‌ ప్రభుత్వాన్ని సంప్రదించడంతో బస్సులపైన అందమైన ప్రకృతి దృశ్యాలతో కూడిన ప్రకటనలకు చోటు కల్పించారు. దాంతో లండన్‌ వాసులు అక్కడ వీధివీధినా తిరిగే బస్సులపైనున్న చిత్రాల ముందు నిల్చుని సెల్ఫీలు తీసుకోవడంతోపాటు.. కేరళకు ప్రయాణం కడుతున్నారట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు