బడికొస్తే ఈతకొట్టొచ్చు!

బడిలో చదువు చెబుతారు, పిల్లల్ని ఆటలాడిస్తారు. డ్రాయింగ్‌, పెయింటింగ్‌ వంటి కొన్ని యాక్టివిటీస్‌ కూడా చేయించడం మనకు తెలుసు. ఈతకొలను వంటి సౌకర్యాలు అయితే కార్పొరేట్‌ స్కూళ్లలోనే కనిపిస్తాయి.

Published : 12 May 2024 00:12 IST

డిలో చదువు చెబుతారు, పిల్లల్ని ఆటలాడిస్తారు. డ్రాయింగ్‌, పెయింటింగ్‌ వంటి కొన్ని యాక్టివిటీస్‌ కూడా చేయించడం మనకు తెలుసు. ఈతకొలను వంటి సౌకర్యాలు అయితే కార్పొరేట్‌ స్కూళ్లలోనే కనిపిస్తాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళితే అక్కడున్న ప్రతి క్లాస్‌ రూమ్‌ ఓ ఈత కొలనునే తలపిస్తుంది. వాటి వల్ల అక్కడి పిల్లలు అసలు స్కూలే మానట్లేదట. ఇంతకీ ఆ బడిలో ప్రతి గదికో ఈత కొలనును ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా!! కనౌజ్‌లోని మహసౌనపూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో దాదాపు 150 మంది పిల్లలు చదువుకుంటున్నారు. మే 21 నుంచి వేసవి సెలవులు కావడంతో... ఇంకా అక్కడ స్కూళ్లు పెడుతున్నారు. కానీ పిల్లలు ఎండ వేడికి తట్టుకోలేక బడిమానేస్తున్నారు. కాబట్టి విద్యార్థుల్ని బడిబాట పట్టించాలనే ఉద్దేశంతో మహసౌనపూర్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైభవ్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ క్లాస్‌రూముల గుమ్మాల వద్ద కొద్ది ఎత్తులో మూయించేసి... గదుల్ని నీళ్లతో నింపేశాడు. ఆవరణలోని చెట్లకి బోర్డులు తగిలించి ఆ నీడలో పిల్లలకు పాఠాలు చెప్పిస్తూ మధ్యమధ్యలో వాళ్లు నీళ్లలో ఆడుకునేందుకు పంపుతున్నారు. పిల్లలు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందుతూ చక్కగా చదువుకుంటున్నారు. ఏ ఒక్కరూ బడిమానకుండా స్కూల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..