పనికిరానివే కానుకలు!

అమ్మవారికి చీరలూ, గాజులూ, ఇతర కానుకలూ సమర్పించాలనుకుంటే... కొత్తవి కొని ఆలయంలో అందించడం చాలామందికి ఆనవాయితీ. కర్ణాటకలోని ఉత్తరకన్నడ జిల్లా కార్వార్‌లో ఉన్న మారెమ్మ ఆలయంలో మాత్రం వాడేసిన వస్తువుల్నే అమ్మవారికి కానుకలుగా ఇస్తుంటారు.

Published : 18 May 2024 23:44 IST

మ్మవారికి చీరలూ, గాజులూ, ఇతర కానుకలూ సమర్పించాలనుకుంటే... కొత్తవి కొని ఆలయంలో అందించడం చాలామందికి ఆనవాయితీ. కర్ణాటకలోని ఉత్తరకన్నడ జిల్లా కార్వార్‌లో ఉన్న మారెమ్మ ఆలయంలో మాత్రం వాడేసిన వస్తువుల్నే అమ్మవారికి కానుకలుగా ఇస్తుంటారు. అలా సమర్పించడం వల్ల సమస్యలన్నీ తీరి... కోరిన కోరికలు నెరవేరతాయని అక్కడి వారి నమ్మకం. అందుకే ప్రతి వేసవిలోనూ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకుని... ఇంట్లో వాడని వస్తువులన్నీ తీసుకొచ్చి అమ్మవారికిస్తారు. అలానే కార్వార్‌ చుట్టుపక్కలున్న పద్దెనిమిది గ్రామాలకు లారీలతో వెళ్లి మరీ ఆ పాత వస్తువులను సేకరిస్తుంటారు ఆలయ నిర్వాహకులు. ఈ కార్యక్రమం జరిగాక ఇళ్లన్నీ శుభ్రం చేసుకుని మారెమ్మకు జాతర చేస్తుంటారు భక్తులు. ఇంట్లోని చెత్తనీ, వాడని వస్తువుల్నీ ఈ విధంగానైనా తీసేస్తారని భావించిన పూర్వీకులు కార్వార్‌లో ఇలాంటి ఆచారం పెట్టారట. అయితే ఒకప్పుడు అమ్మవారికి వచ్చిన చెత్తనంతా డంపింగ్‌ యార్డుకు తరలిస్తే... ప్రస్తుతం రీసైక్లింగ్‌ చేయిస్తున్నారట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..