ఎండల్లో హాయిగా...

సాధారణంగా వడదెబ్బ కారణంగా చాలా ప్రాంతాల్లో మరణాలు సంభవిస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఆ సంఖ్య పెరుగుతుంటుంది. అహ్మదాబాద్‌లో మాత్రం  వడదెబ్బ పేరే వినిపించదు.

Published : 18 May 2024 23:45 IST

సాధారణంగా వడదెబ్బ కారణంగా చాలా ప్రాంతాల్లో మరణాలు సంభవిస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఆ సంఖ్య పెరుగుతుంటుంది. అహ్మదాబాద్‌లో మాత్రం  వడదెబ్బ పేరే వినిపించదు. ఎందుకంటే... అక్కడి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వేసవిలో రకరకాల ప్రణాళికలు అమలు చేస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ‘హీట్‌ యాక్షన్‌ ప్లాన్‌’ పేరుతో ఎప్పటికప్పుడు పెరిగే ఉష్ణోగ్రతల గురించి ప్రజలను అప్రమత్తం చేస్తుంటుంది. పెద్దఎత్తున చలివేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లనూ అందించి ఏ ఒక్కరూ డీహైడ్రేషన్‌  బారిన పడకుండా చూస్తుంటారు. రద్దీ కారణంగా ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద ఎవరూ ఎండలో ఆగకుండా ఉండేందుకు వీలుగా- వేసవిలో మాత్రం రెడ్‌లైట్‌ను వేయకుండా ట్రాఫిక్‌ను వదులుతారు. ఒకవేళ సిగ్నల్‌ వేయడం తప్పనిసరైతే అక్కడ స్ప్రింక్లర్స్‌ అమర్చి... చిరుజల్లులు కురిపిస్తుంటారు. ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేయడంతోపాటు ఆయా కార్యాలయాలూ, ఆలయాలూ, మసీదుల్లోనూ పెద్దపెద్ద కూలర్లను ఏర్పాటు చేసి జనాలు సేద తీరేలా చూస్తున్నారు మున్సిపల్‌ అధికారులు. ఈ జాగ్రత్తలతో గత రెండేళ్లుగా వడదెబ్బ మరణాలు బాగా తగ్గిపోయాయట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..