దారి చూపుతున్నారు

అంధులకు ప్రత్యేకంగా స్కూళ్లుంటాయి. మామూలు పాఠశాలతో పోలిస్తే అక్కడ బోధన పద్ధతుల్లోనూ, సిలబస్‌లోనూ మార్పులుంటాయి. అయినా స్కూలు భవనాలు మాత్రం అన్నింటి మాదిరే ఉంటాయి.

Published : 18 May 2024 23:48 IST

అంధులకు ప్రత్యేకంగా స్కూళ్లుంటాయి. మామూలు పాఠశాలతో పోలిస్తే అక్కడ బోధన పద్ధతుల్లోనూ, సిలబస్‌లోనూ మార్పులుంటాయి. అయినా స్కూలు భవనాలు మాత్రం అన్నింటి మాదిరే ఉంటాయి. గాంధీనగర్‌లోని సీల్యాబ్స్‌ అనే సంస్థ ఆ చుట్టుపక్కల ఉన్న అంధులకోసం ఓ స్కూలును నిర్మించింది. ఆవరణలో అడుగుపెట్టింది మొదలు క్లాస్‌లో కూర్చునే వరకూ పిల్లలు ఎవరి మీదా ఆధారపడకుండా ఉండాలని ఈ సంస్థ స్కూలు భవనాన్ని వినూత్నంగా నిర్మించింది. ఒక్కో తరగతి దగ్గర ఒక్కో రకమైన సువాసన వెదజల్లే మరువం, దవనం వంటి మొక్కల కుండీలను ఉంచారు. గోడల మీద బ్రెయిలీ లిపిలో ఏ గది వద్ద ఉన్నారో రాయించారు. మూలల వద్ద ఎటు వైపు వెళ్లాలో త్రీడీ ఇండికేటర్లనూ, అడుగడుగునా అమర్చిన సెన్సర్ల ఆధారంగా అనౌన్స్‌మెంట్‌ వచ్చేలానూ ఏర్పాట్లు చేశారు. అంధులకు ప్రాథమిక విద్యతోపాటు, రకరకాల వృత్తి విద్యలను ఉచితంగా నేర్పించడానికి సీల్యాబ్స్‌ స్థాపించిన ఇలాంటి స్కూలును అన్ని ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తే ఎంతో మంది అంధులకు మేలు జరుగుతుంది కదా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..