దిగుబడికి డక్‌ ఆర్మీ!

రకరకాల పురుగులూ, నత్తలూ నీళ్లలో ఉండి వరి పంటకు హాని చేస్తుంటాయి. తెగుళ్లు కూడా ఎక్కువగానే సోకుతుంటాయి. అందుకోసం రైతులు రసాయన ఎరువులను పిచికారీ చేయడం మనకు తెలిసిందే.

Published : 18 May 2024 23:49 IST

కరకాల పురుగులూ, నత్తలూ నీళ్లలో ఉండి వరి పంటకు హాని చేస్తుంటాయి. తెగుళ్లు కూడా ఎక్కువగానే సోకుతుంటాయి. అందుకోసం రైతులు రసాయన ఎరువులను పిచికారీ చేయడం మనకు తెలిసిందే. అయితే కొన్ని దేశాల్లో భూసారాన్ని దెబ్బతీసే హానికర ఎరువులకు బదులుగా బాతులను ఉపయోగిస్తున్నారు రైతులు. అదెలాగంటే... సహజంగా బాతులు నీటిమడుగుల్లోనూ, కాలవల్లోనూ, చెరువుల్లోనూ పురుగుల్ని పట్టి తింటుంటాయి. కాబట్టి వరి పొలంలో వీటిని వదలడం వల్ల నీళ్లలోని పురుగుల్నీ, నత్తల్నీ, తెగుళ్లనీ తినేస్తాయి. థాయ్‌లాండ్‌, తైవాన్‌, చైనా వంటి కొన్ని దేశాల్లో ఇందుకోసమే కొందరు వేల సంఖ్యలో బాతుల్ని పెంచుతుంటారు. ‘డక్‌ ఆర్మీ’ పేరిట వీటిని రైతులకు అద్దెకిచ్చి... వరి పొలాల్లోకి వదులుతారు. ఇలా చేయడం వల్ల అటు బాతులను పెంచేవారికి ఆదాయం లభించడంతోపాటు దాణా ఖర్చూ మిగులుతుంది. ఇటు రైతులకు పురుగుమందులు వాడే బెడద తప్పడంతోపాటు భూసారం కూడా పెరిగి... ఏటికేడు దిగుబడి కూడా వృద్ధి అవుతోందట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..