పెట్రోలింగ్‌కు రోల్స్‌రాయిస్‌!

సాధారణంగా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పెట్రోలింగ్‌కు మామూలు కార్లనే వాడుతుంటారు ఎక్కడైనా. ఫ్లోరిడాలోని మియామీ నగరంలో మాత్రం విలాసవంతమైన రోల్స్‌రాయిస్‌ను ఉపయోగించి నగరమంతా పెట్రోలింగ్‌ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు

Published : 26 May 2024 00:55 IST

సాధారణంగా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పెట్రోలింగ్‌కు మామూలు కార్లనే వాడుతుంటారు ఎక్కడైనా. ఫ్లోరిడాలోని మియామీ నగరంలో మాత్రం విలాసవంతమైన రోల్స్‌రాయిస్‌ను ఉపయోగించి నగరమంతా పెట్రోలింగ్‌ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు అక్కడి పోలీసులు. అసలు ఆ కారు ఎక్కడమే గొప్పగా భావిస్తుంటారు చాలామంది. అలాంటిది- సెలెబ్రిటీలూ ధనవంతులూ మాత్రమే వాడే రోల్స్‌రాయిస్‌ను ప్రపంచంలోనే తొలిసారి పెట్రోలింగ్‌కు వాడి రికార్డు సృష్టిస్తోంది మియామీ పోలీసు డిపార్ట్‌మెంట్‌. రోల్స్‌రాయిస్‌ ఘోస్ట్‌ మోడల్‌ అయిన ఈ కారు ధర రూ. 8 కోట్లకు పైమాటే. ఈ మధ్య మియామీ పోలీసు శాఖలో చేరడానికి యువత ఉత్సాహం చూపకపోవడంతో ఎక్కువ మందిని ఆకర్షించడానికి ఈ ప్రయత్నం చేశారట అక్కడి పోలీసులు అధికారులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..