చనిపోయినా పెళ్లి చేయాల్సిందే!

‘ముప్ఫై ఏళ్ల క్రితం చనిపోయిన మా అమ్మాయికి తగిన వరుడు కావలెను’ అనే పత్రికా ప్రకటన ఒకటి ఈ మధ్య బాగా వైరల్‌ అయింది.

Published : 26 May 2024 01:03 IST

‘ముప్ఫై ఏళ్ల క్రితం చనిపోయిన మా అమ్మాయికి తగిన వరుడు కావలెను’ అనే పత్రికా ప్రకటన ఒకటి ఈ మధ్య బాగా వైరల్‌ అయింది. చనిపోయిన కూతురికి సంబంధం చూడ్డం ఏంటని ఆశ్చర్యపోయారు అది చూసిన వారంతా. ఈ ప్రకటన ఏదో సరదాకి ఇచ్చింది అనుకుంటే పొరపాటే. అది సెంటిమెంటును గౌరవిస్తూ ఇచ్చిన ప్రకటన. తుళునాడు ప్రాంతంలో(కర్ణాటకలోని ఉడుపి, దక్షిణకన్నడ- కేరళలోని కాసర్‌గోడ్‌) అవివాహితులు చనిపోతే వారికి పెళ్లి చేసే ఆచారముంది. అప్పుడే వారి జీవితం పరిపూర్ణమవుతుందని అక్కడి ప్రజల విశ్వాసం. అందుకే మామూలు పెళ్లి సంబంధాలు ఎలా చూస్తారో అలానే చనిపోయినవారికీ తగిన వయసువారిని వెతుకుతారు. సంబంధం కుదిరాక.. చనిపోయిన తమ పిల్లల్ని బొమ్మల రూపంలో ఊహించుకుని, వాటికి ఘనంగా పెళ్లి జరిపిస్తారు. కర్ణాటకకు చెందిన ఓ రైతు కూతురికి ముప్ఫై ఏళ్లుగా తగిన సంబంధం దొరక్కపోవడంవల్లే ఇలా ప్రకటన ఇవ్వాల్సి వచ్చిందన్నమాట. ఈ ప్రకటన వల్ల వరుడు దొరకడం, పెళ్ళి జరగడం కొసమెరుపు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..