బంకు చల్లగుండా...

భగభగమంటూ భానుడు తన  ప్రతాపాన్ని చూపిస్తుండటంతో- ఇంట్లోంచి కాలు బయటపెట్టాలంటేనే భయమేస్తోంది. ఎండా,వడగాలులూ తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి.

Published : 26 May 2024 01:06 IST

భగభగమంటూ భానుడు తన  ప్రతాపాన్ని చూపిస్తుండటంతో- ఇంట్లోంచి కాలు బయటపెట్టాలంటేనే భయమేస్తోంది. ఎండా,వడగాలులూ తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి. అలాగని రోజంతా ఏసీలో ఉండాలన్నా కష్టమే. అది అందరికీ సాధ్యంకాకపోవచ్చు కూడా. అయితే తమ పెట్రోలు బంకులో ఆరు బయట మండే ఎండలో పనిచేసే సిబ్బందికీ, అక్కడికొచ్చే కస్టమర్లకూ ఉపశమనాన్ని ఇవ్వాలనుకున్నాడో యజమాని. కరీంనగర్‌కు చెందిన అతను దాదాపు లక్షరూపాయలు ఖర్చుపెట్టి యాభై స్ప్రింక్లర్ల(బిందుసేద్యానికి వాడేవి)ను తీసుకొచ్చాడు. వాటిని బంకుపై భాగంలో ఏర్పాటు చేసి, నీటి తుంపర్లు చిరుజల్లులా కిందికి పడేట్లు చేసి, ఆవరణంతా చల్లగా ఉండేలా చూస్తున్నాడు. పొగమంచులా నీటిబిందువులు పడుతూ వాతావరణాన్ని చల్లబరుస్తుండటంతో- సిబ్బందీ, పెట్రోలు కొట్టించుకునేవారూ, ఆ దారిన వెళ్లేవారూ అక్కడ హాయిగా సేదతీరుతున్నారు. బంకు యజమాని  పదికాలాలపాటు చల్లగా ఉండాలనీ కోరుకుంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు