ప్రపంచంలోనే ఎత్తైన ఎద్దు!

సాధారణంగా పశువులు దాదాపు నాలుగు అడుగుల ఎత్తు ఉంటాయి. ఎక్కడో ఒక చోట అరుదుగా ఐదడుగులున్నవి కనిపిస్తుంటాయి.

Published : 09 Jun 2024 01:15 IST

సాధారణంగా పశువులు దాదాపు నాలుగు అడుగుల ఎత్తు ఉంటాయి. ఎక్కడో ఒక చోట అరుదుగా ఐదడుగులున్నవి కనిపిస్తుంటాయి. ఈ మధ్య అమెరికాలోని ఓరెగాన్‌లో సుమారు ఆరున్నర అడుగులున్న ఓ ఎద్దు ప్రపంచంలోనే ఎత్తైందిగా గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. హాల్‌స్టైన్‌ జాతికి చెందిన ఆరేళ్ల ఈ ఎద్దు పేరు రోమియో. మసాచూసెట్స్‌కి చెందిన టామీ అనే పశువు ఆరడుగుల ఎత్తుతో చాలా కాలంగా గిన్నిస్‌బుక్‌లో ఉంది. ప్రతిరోజూ పదికేజీల ఆపిల్స్‌నీ, ఎనిమిది గెలల అరటిపండ్లనీ, యాభై కిలోల గడ్డినీ తినే రోమియో తాజాగా ఆ రికార్డును బద్దలు కొట్టింది. పదినెలల వయసులో కబేళాకు తరలిస్తుండగా మిస్టీమూర్‌ అనే రైతు దాన్ని రక్షించి ఇంటికి తీసుకొచ్చి కన్నబిడ్డలా సంరక్షిస్తున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..