హాయిగా చదువుకోవచ్చు!

లైబ్రరీల్లో పుస్తకాలూ, బల్లలూ, కుర్చీలూ ఉంటాయి. నాలుగ్గోడల మధ్యన విద్యుత్‌ వెలుగుల్లో ఆ వాతావరణం ఎంతో గంభీరంగా ఉంటుంది.

Published : 09 Jun 2024 01:17 IST

లైబ్రరీల్లో పుస్తకాలూ, బల్లలూ, కుర్చీలూ ఉంటాయి. నాలుగ్గోడల మధ్యన విద్యుత్‌ వెలుగుల్లో ఆ వాతావరణం ఎంతో గంభీరంగా ఉంటుంది. దక్షిణకొరియా రాజధాని సియోల్‌లో ఉన్న మెట్రో లైబ్రరీ చదువుకోవడానికే కాదు ఆహ్లాదంగా గడపడానికి కూడా ఎంతో బాగుంటుంది. అందుకే ఆ లైబ్రరీ ఈ మధ్య అంతర్జాతీయ గ్రంథాలయాల సమాఖ్య నుంచి గ్రీన్‌ అవార్డును అందుకుంది. ఆరుబయట చుట్టూ చెట్లూ- వాటి మధ్య పచ్చిక బయళ్లలో ఏర్పాటు కావడమే ఆ గ్రంథాలయం ప్రత్యేకత. దాదాపు ఐదువేల పుస్తకాలున్న ఆ లైబ్రరీలో రంగురంగుల బీన్‌ బ్యాగులుంటాయి. వాటిపైన ఎక్కడంటే అక్కడ కూర్చుని లేదంటే పడుకుని పుస్తకాలు చదువుకోవచ్చు. ప్రకృతిని ఆస్వాదిస్తూ పుస్తకాలు చదువుకునే వీలున్న ఆ లైబ్రరీ- దాదాపు 150 దేశాల్లోని సుమారు పదిహేను వందల ‘లైబ్రరీస్‌ ఫెడరేషన్ల’ మెప్పు పొంది గ్రీన్‌ అవార్డును సొంతం చేసుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..