పార్కిన్సన్స్‌నీ పసిగట్టేస్తున్నాయట!

అమెరికాలో ఆ మధ్య కొన్నిరకాల క్యాన్సర్‌లూ, కొవిడ్‌ వంటి వ్యాధుల్ని పసిగట్టేందుకు కుక్కల్ని వాడుతున్నారంటూ వార్తలొచ్చాయి కదా! తాజాగా ఆ కోవలోకి ‘పార్కిన్సన్స్‌ డిసీజ్‌’ కూడా వచ్చి చేరింది.

Published : 09 Mar 2024 23:24 IST

మెరికాలో ఆ మధ్య కొన్నిరకాల క్యాన్సర్‌లూ, కొవిడ్‌ వంటి వ్యాధుల్ని పసిగట్టేందుకు కుక్కల్ని వాడుతున్నారంటూ వార్తలొచ్చాయి కదా! తాజాగా ఆ కోవలోకి ‘పార్కిన్సన్స్‌ డిసీజ్‌’ కూడా వచ్చి చేరింది. శరీర నాడీవ్యవస్థని దెబ్బతీసే తీవ్ర సమస్య ఇది. ఈ వ్యాధి బయటపడటానికి ముందే చర్మం నుంచి స్రవించే ‘సీబమ్‌’ ద్రవాల్లో- దానికి సంబంధించిన వందరకాల రసాయనాలు ఉంటాయని ఇదివరకే శాస్త్రవేత్తలు నిరూపించారు. కానీ- ఆ రసాయనాలని ల్యాబులో కచ్చితత్వంతో వేరుచేసే పద్ధతులేవీ ఇప్పటిదాకా రాలేదు. అందుకే- శాస్త్రవేత్తలు కుక్కల సాయం తీసుకుంటున్నారు. మనకంటే వాటి ఆఘ్రాణశక్తి లక్షరెట్లు ఎక్కువ కాబట్టి ఈమేరకు ప్రత్యేక తర్ఫీదునిస్తున్నారు. వాషింగ్టన్‌లోని ‘పాడ్స్‌ ఫర్‌ పార్కిన్సన్స్‌’ అనే సంస్థ ఇందుకోసం 23 జాతులకి చెందిన 16 పెంపుడు కుక్కల్ని ఎంపికచేసింది. వాటికి- ఫ్రాన్స్‌లో ఎనిమిది నెలలపాటు శిక్షణ అందించింది. శిక్షణ తర్వాత ఆ శునకాలకి పార్కిన్సన్స్‌ వ్యాధిగ్రస్తులూ, ఆ సమస్యలేనివాళ్ళూ వాడిన దుస్తుల్ని అందిస్తే- 86 శాతం కచ్చితంగా అవి రోగుల్ని గుర్తుపట్టేశాయట. మరో నాలుగునెలల శిక్షణతో ఇవి వ్యాధి ప్రారంభదశనీ పసిగట్టేస్తాయని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు శిక్షకులు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..