‘షుగర్‌ ఫ్రీ’ సమస్యలు రావిక!

మధుమేహం ఉన్నవాళ్ళో, ఆ సమస్య వస్తుందని భయపడు తున్నవాళ్ళో ఈ మధ్య ‘షుగర్‌-ఫ్రీ’ తీపి పదార్థాల్ని తీసుకుంటున్నారు.

Published : 09 Mar 2024 23:25 IST

ధుమేహం ఉన్నవాళ్ళో, ఆ సమస్య వస్తుందని భయపడు తున్నవాళ్ళో ఈ మధ్య ‘షుగర్‌-ఫ్రీ’ తీపి పదార్థాల్ని తీసుకుంటున్నారు. వీటివల్ల కొందరిలో కడుపులో గ్యాస్‌ పెరగడమూ, విరేచనాలూ వంటి సమస్యలు వస్తుంటాయి. దీనికి కారణమేంటని ఆరా తీశారు పరిశోధకులు. ఈ షుగర్‌ ఫ్రీ వస్తువులన్నింటినీ ‘సార్బిటాల్‌’ అన్న పదార్థంతో చేస్తారు. జీర్ణాశయంలోకి వెళ్ళాక -మనం వాడే చక్కెరా, బెల్లంకన్నా కాస్త ఆలస్యంగా కరుగుతుందీ పదార్ధం. అందువల్లే, రక్తంలోని గ్లూకోజ్‌ వెంటనే పెరగదు. ఆ కారణంగానే దీనితో చేసే ఆహార పదార్థాల్ని ‘షుగర్‌ ఫ్రీ’ అంటుంటారు. మామూలుగా కడుపులో చేరిన సార్బిటాల్‌ని- జీర్ణాశయంలోని ‘క్లస్ట్రిడియమ్‌’ రకం బ్యాక్టీరియాలు విడగొట్టి కరిగేలా చేస్తాయట. కానీ కొందరిలో ఈ బ్యాక్టీరియాలు ఉండవు. ఎవరా కొందరు అంటే... అధిక కొవ్వులున్న ఆహారాన్ని తీసుకునేవాళ్ళూ, చీటికీమాటికీ యాంటీ బయోటిక్స్‌ వాడుతున్నవాళ్ళేనని చెబుతున్నారు పరిశోధకులు. కొవ్వు పదార్థాలూ యాంటీ బయోటిక్‌లూ తగ్గించినా కూడా వీరిలో వెంటనే ఫలితం కనిపించదనీ అల్సర్‌ సమస్యలకి వాడే మిసాలజిన్‌ రకం మందులు వాడితే ప్రయోజనం ఉంటుందనీ వారు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు