ఆ కణాల సంఖ్యను పెంచగలిగితే!

ఫ్లూ వైరస్‌లు కొందరికి తరచూ సోకుతుంటాయి. రోగనిరోధకశక్తి ఉన్నవాళ్లకి అంత తరచుగా రాకపోవచ్చు.

Published : 02 Apr 2023 00:59 IST

ఆ కణాల సంఖ్యను పెంచగలిగితే!

ఫ్లూ వైరస్‌లు కొందరికి తరచూ సోకుతుంటాయి. రోగనిరోధకశక్తి ఉన్నవాళ్లకి అంత తరచుగా రాకపోవచ్చు. అయితే దీనికి కారణం రోగనిరోధకశక్తి ఒక్కటే కాదు, మెదడులోని మెమొరీ-బి కణాలు కూడా అంటున్నారు బర్మింగ్‌హామ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ అలబామాకు చెందిన నిపుణులు. ఎందుకంటే ఒకసారి సోకిన ఇన్ఫెక్షన్‌నీ లేదా వ్యాక్సినేషన్‌ ద్వారా లోపలకు వచ్చిన వైరస్‌నీ ఈ కణాలు బాగా గుర్తు పెట్టుకుంటాయట. దాంతో మళ్లీ ఆ రకమైన వైరస్‌ లోపలకు ప్రవేశించగానే వెంటనే గుర్తించి, వాటిని తరిమికొట్టేందుకు యాంటీబాడీలు ఉత్పత్తయ్యేలా చేస్తాయి. కాబట్టి ఫ్లూ సంబంధిత వైరస్‌ల నివారణలో ఈ మెమొరీ బి- కణాల పాత్రే కీలకమని పేర్కొంటున్నారు. టీకా ఇచ్చినప్పుడు- కణాల ఉపరితలంలో ఉండే ఎఫ్‌సిఆర్‌ఎల్‌5 అనే రిసెప్టర్‌ ప్రొటీన్‌ ద్వారా ఈ కణాలను గుర్తించగలిగారట. దీన్నిబట్టి ఏటా ఏ రకమైన ఫ్లూ వైరస్‌ ఎక్కువగా వస్తుందో పరిశీలించి, దానికి సంబంధించిన నాణ్యమైన వ్యాక్సిన్‌ను ఇవ్వడం ద్వారా మెమొరీ-బి కణాల సంఖ్యను పెంచగలిగితే వైరల్‌ ఇన్ఫెక్షన్లను అడ్డుకోవచ్చు అంటున్నారు. ఎందుకంటే సీజనల్‌ ఫ్లూ జ్వరాల కారణంగానే ఏటా మూడు నుంచి ఏడు లక్షలమంది మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..