‘నానో’ మందు... పీల్చితే చాలు!

క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌(సీఓపీడీ)... మనదేశంలో ఎక్కువ మరణాలకి కారణమయ్యే ఊపిరితిత్తుల సమస్య. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సమస్యతో అత్యధిక మరణాలు చోటుచేసుకునేది కూడా మనదేశంలోనేనట.

Published : 18 Feb 2024 00:06 IST

క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌(సీఓపీడీ)... మనదేశంలో ఎక్కువ మరణాలకి కారణమయ్యే ఊపిరితిత్తుల సమస్య. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సమస్యతో అత్యధిక మరణాలు చోటుచేసుకునేది కూడా మనదేశంలోనేనట. పొగతాగడం వల్లో కాలుష్యం కారణంగానో ఊపిరితిత్తులకెళ్ళే నాళాలు కుంచించుకుపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. అలా ఇరుకై గట్టిపడ్డ శ్వాస నాళాల్లో కఫం చేరడం, అది బయటకెళ్ళే మార్గం లేక బ్యాక్టీరియా పెరగడం, అవి ఊపిరితిత్తులపైన దాడి చేయడం- ఇలా ఉంటుందీ సమస్య పరిణామక్రమం. ఉబ్బసం వంటి సమస్యలకిలాగే ఈ మధ్య దీనికీ ఇన్‌హేలర్‌ని సూచిస్తున్నారుకానీ- ఆ మందు లోపలికి వెళ్ళకుండా కఫం అడ్డుకోవడం వల్ల పెద్ద ఫలితం ఉండట్లేదు. దానికి పరిష్కారంగానే ‘నానో’ మందుని కనిపెట్టారు చైనా శాస్త్రవేత్తలు. ఇందుకోసం పీల్చడానికి సులభంగా ఉండే ప్రత్యేక నానో సిలికాన్‌ని రూపొందించారు అక్కడి సుజౌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు. ఈ సూక్ష్మ సిలికాన్‌ బోలుగా ఉంటుంది. ఆ బోలులో యాంటీబయోటిక్స్‌ని నింపి ఇన్‌హేలర్‌ పరికరంలో పెట్టి అందిస్తారట. దీన్ని ఇప్పటికే ఎలుకల్లో ప్రయోగించి విజయం సాధించారు. ఈ మందు మిగతావాటికన్నా బాగా కఫాన్ని కరిగించి బ్యాక్టీరియాలతో సమర్థంగా పోరాడుతోందని చెబుతున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..