కుంగుబాటుకి కొత్త చికిత్స!

ప్రపంచంలో కనీసం ఐదు శాతం మంది మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నారని చెబుతున్నాయి అధ్యయనాలు. ఒక్క అమెరికా యువతలోనే 2013 నుంచి 2016 మధ్య 33 శాతం మానసిక కుంగుబాటు సమస్య పెరిగిందట.

Updated : 18 Feb 2024 08:51 IST

ప్రపంచంలో కనీసం ఐదు శాతం మంది మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నారని చెబుతున్నాయి అధ్యయనాలు. ఒక్క అమెరికా యువతలోనే 2013 నుంచి 2016 మధ్య 33 శాతం మానసిక కుంగుబాటు సమస్య పెరిగిందట. ఈ సమస్యకి సంబంధించిన చికిత్స ఇప్పటిదాకా పూర్తిగా మానసిక వైద్యం చుట్టే తిరుగుతుండేది. అదొక్కటే కాకుండా ‘శారీరకంగా చిన్నపాటి మార్పుల్ని తీసుకొచ్చి ఈ సమస్య తీవ్రతని తగ్గించొచ్చా...?’ అన్న ఆశని రేకెత్తిస్తోంది తాజా పరిశోధన ఒకటి. మానసిక కుంగుబాటుకీ శరీర ఉష్ణోగ్రత పెరుగుదలకీ(జ్వరం కన్నా కొంత తక్కువ స్థితి) దగ్గర సంబంధం ఉందంటోందీ అధ్యయనం. అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు ఇందుకోసం 106 దేశాల నుంచి 20 వేల మందిని పరిశీలించారు. ‘కుంగుబాటుతో శరీర ఉష్ణోగ్రత ఎందుకు పెరుగుతోంది... జీవక్రియ(మెటబాలిజం)లో తేడా వల్లనా? లేకపోతే- ఉష్ణోగ్రతని స్థిమితంగా ఉంచే యంత్రాంగంలో సమస్య రావడం వల్లనా?’ అన్న దిశగానూ మరెన్నో పరిశోధనలు చేస్తున్నారు. మానసిక కుంగుబాటువల్ల ఉష్ణోగ్రత పెరిగినప్పుడు- శరీరాన్ని చల్లగా మార్చడం ద్వారా దాని తీవ్రతని తగ్గించే అవకాశాలూ ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..