ఆలూచిప్స్‌... ఇక నిశ్చింతగా తినొచ్చు!

చేగోడీలు, మురుకులు, వడియాలు... ఇలా నూనెలో వేయించిన చిరుతిళ్ళ ఆహారం మార్కెట్టు విలువ మనదేశంలో ఏటా కొన్ని వేల కోట్ల రూపాయలట! వాటిల్లో 85 శాతం వాటా ఆలూచిప్స్‌దేనంటారు. కానీ, ఈ చిప్స్‌లో- చాలా తక్కువ మోతాదులో అక్రిలామైడ్‌ అనే క్యాన్సర్‌ కారక రసాయనం ఉంటోందని ఇప్పటికే పలు పరిశోధనలు హెచ్చరించాయి.

Published : 03 Mar 2024 00:07 IST

చేగోడీలు, మురుకులు, వడియాలు... ఇలా నూనెలో వేయించిన చిరుతిళ్ళ ఆహారం మార్కెట్టు విలువ మనదేశంలో ఏటా కొన్ని వేల కోట్ల రూపాయలట! వాటిల్లో 85 శాతం వాటా ఆలూచిప్స్‌దేనంటారు. కానీ, ఈ చిప్స్‌లో- చాలా తక్కువ మోతాదులో అక్రిలామైడ్‌ అనే క్యాన్సర్‌ కారక రసాయనం ఉంటోందని ఇప్పటికే పలు పరిశోధనలు హెచ్చరించాయి. ఈ హానికారక రసాయనం ఉత్పత్తి కావడానికి ప్రధాన కారణం- బంగాళాదుంపల్ని ఎక్కువకాలం శీతల గిడ్డంగుల్లో ఉంచడమేనంటారు.  అలా ఉంచినప్పుడు- బంగాళాదుంపల్లోని పిండిపదార్థం(స్టార్చ్‌) కాస్తా చక్కెరలుగా మారుతుంది. ఈ ప్రక్రియని కోల్డ్‌ ఇండ్యూస్డ్‌ స్వీటెనింగ్‌(సీఐఎస్‌) అంటారు. ‘సీఐఎస్‌’కి లోనైన ఆలూని నూనెలో వేయించడం వల్లే హానికారక ‘అక్రిలామైడ్‌’ ఉత్పత్తవుతుంది. ఈ సమస్యకి ఓ పరిష్కారం కనిపెట్టారు అమెరికాలోని మిషిగన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్లు- జిమింగ్‌ జియాంగ్‌, డేవిడ్‌ డూషస్‌. వీళ్ళు ఇటీవల బంగాళాదుంపల్లో అలా ‘సీఐఎస్‌’కి కారణమయ్యే జన్యువునీ, దాని నియంత్రణ వ్యవస్థనీ పసిగట్టారు. ఆ జన్యువుని నిర్వీర్యం చేసే పద్దతినీ ఆవిష్కరించేశారు. దాంతో ఇకపైన బంగాళాదుంపలు ఎన్నిరోజులు శీతలగిడ్డంగుల్లో ఉన్నా సరే క్యాన్సర్‌ కారక రసాయనాలు ఉండబోవని... హామీ ఇస్తున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..