బట్టతల మందుతో... హృద్రోగ చికిత్స?!

మగవారిలో ఓ వయసు దాటాక బట్టతల వస్తుంది, దాంతోపాటూ ప్రొస్టేట్‌ గ్రంథి కూడా వాస్తుంది. ఈ రెండు సమస్యలకీ ఒకే ఔషధంగా 1990ల నుంచీ ‘ఫినాస్టరైడ్‌’ అనే మందుని ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. దాని మంచిచెడులపైన అమెరికాలోని ఇలినాయి విశ్వవిద్యాలయం 2009- 2016 మధ్య ఓ అధ్యయనం నిర్వహించింది.

Published : 03 Mar 2024 00:08 IST

గవారిలో ఓ వయసు దాటాక బట్టతల వస్తుంది, దాంతోపాటూ ప్రొస్టేట్‌ గ్రంథి కూడా వాస్తుంది. ఈ రెండు సమస్యలకీ ఒకే ఔషధంగా 1990ల నుంచీ ‘ఫినాస్టరైడ్‌’ అనే మందుని ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. దాని మంచిచెడులపైన అమెరికాలోని ఇలినాయి విశ్వవిద్యాలయం 2009- 2016 మధ్య ఓ అధ్యయనం నిర్వహించింది. అందులో పాల్గొన్నవారి వైద్య వివరాలని విశ్లేషిస్తే- ఫినాస్టరైడ్‌ మందుని వాడినవాళ్ళలో రక్తంలోని కొవ్వుశాతం తగ్గడం గమనించారట. ‘ఇదేదో బావుందే’ అనుకుని ఆ మందుపైన ఇటీవల మరిన్ని పరిశోధనలు చేశారు అదే వర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ జావుమా అమింగ్వల్‌. ఆ మందుని రకరకాల డోసులతో ఎలుకలకి ఇచ్చారు. మందుతోపాటూ అత్యధిక కొవ్వులతో కూడిన ఆహారాన్ని కూడా వాటికి పెట్టారు. నెల తర్వాత పరిశీలిస్తే ఎంత ఎక్కువ కొవ్వుల్ని తిన్నాసరే- ఎలుకల రక్తంలోనూ, గుండెకి రక్తం సరఫరా చేసే ధమనుల్లోనూ కొవ్వు చేరలేదని తేలిందట. అంతేకాదు, కాలేయ వాపు సూచీలు(లిపిడ్‌ మార్కర్స్‌) కూడా పెరగలేదట. దానిక్కారణం ఈ మందేనని నిర్ధారించారు. మనుషుల్లోనూ ఇది సత్ఫలితం చూపొచ్చని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..