Biryani - Rice: ఇది బిర్యానీయే... కానీ వేరు!

బిర్యానీ అంటే బియ్యం వేరుగా, మాంసం వేరుగా ఉంటుంది. మరి ఆ బియ్యం గింజలోనే మాంసం భాగమైతే ఎలా ఉంటుంది? దక్షిణ కొరియా సియోల్‌లోని యోన్సే వర్సిటీ శాస్త్రవేత్తలు అలాంటి విచిత్ర ప్రయోగం ఒకటి చేశారు.

Updated : 03 Mar 2024 19:40 IST

బిర్యానీ అంటే బియ్యం వేరుగా, మాంసం వేరుగా ఉంటుంది. మరి ఆ బియ్యం గింజలోనే మాంసం భాగమైతే ఎలా ఉంటుంది? దక్షిణ కొరియా సియోల్‌లోని యోన్సే వర్సిటీ శాస్త్రవేత్తలు అలాంటి విచిత్ర ప్రయోగం ఒకటి చేశారు. వరి కంకి ఎదిగేటప్పుడే వడ్లకి మాంసం కణాలని అతికించి వాటిని పెరగనిచ్చారు. వారంపాటు కంకిలో అవి ఎదిగాక- ల్యాబుల్లో పెట్టి మరో వారం పెంచారు. అలా ఎదిగిన వడ్లని పొట్టుతీసి చూస్తే... ఏముంది! మాంసం కలిసిన సరికొత్త ‘హైబ్రిడ్‌’ బియ్యం సిద్ధమై పోయింది.

ఈ మధ్య ల్యాబుల్లో మాంసాన్ని ఉత్పత్తి చేయడం గురించి వినే ఉంటారు. దానికి ఖర్చు చాలా ఎక్కువగా ఉంటోందట. ఆ వ్యయం తగ్గించాలనే మాంసం కణాలని ఇలా వడ్లతో కలిపి పెంచే సరికొత్త ప్రయోగానికి తెరతీశారు శాస్త్రవేత్తలు. గులాబీ రంగులో మన ఊరి దొడ్డుబియ్యంలా ఉండే ఈ హైబ్రిడ్‌ రకాన్ని వండి చూసి... రుచి అమోఘమంటున్నారు కొరియన్‌ శాస్త్రవేత్తలు. మామూలు బియ్యాని కన్నా ఇందులో ప్రొటీన్‌ ఏడుశాతం ఎక్కువగా ఉందనీ వివరిస్తున్నారు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..