వేలి ముద్రలకో ‘స్ప్రే’

సాధారణంగా నేరం జరిగాక- అది జరిగిన చోట నేరస్థుల వేలిముద్రలుంటాయి. వీటిలో కొన్ని మామూలు కళ్ళకి కనిపిస్తే మరికొన్ని కనిపించవు. అలా కనిపించనివాటిని లేటెంట్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ అంటారు. వాటిని సేకరించడానికి ఫోరెన్సిక్‌ నిపుణులు ఇప్పటిదాకా వివిధ రసాయన చూర్ణాల్ని వాడుతూ వస్తున్నారు. వాటిని విశ్లేషించడానికి కనీసం గంటైనా పడుతుంది.

Updated : 17 Mar 2024 04:57 IST

సాధారణంగా నేరం జరిగాక- అది జరిగిన చోట నేరస్థుల వేలిముద్రలుంటాయి. వీటిలో కొన్ని మామూలు కళ్ళకి కనిపిస్తే మరికొన్ని కనిపించవు. అలా కనిపించనివాటిని లేటెంట్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ అంటారు. వాటిని సేకరించడానికి ఫోరెన్సిక్‌ నిపుణులు ఇప్పటిదాకా వివిధ రసాయన చూర్ణాల్ని వాడుతూ వస్తున్నారు. వాటిని విశ్లేషించడానికి కనీసం గంటైనా పడుతుంది. అలాకాకుండా- కేవలం కొన్ని క్షణాల్లోనే వేలి ముద్రల్ని వెలుగులోకి తెచ్చే సరికొత్త ద్రవ మిశ్రమాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. నేరం జరిగిన చోట ఈ ద్రవాన్ని స్ప్రే చేస్తే చాలు అప్పటిదాకా అదృశ్యంగా ఉన్న ముద్రలన్నీ బయటపడి పోతాయి. చైనాలోని షాంఘై నార్మల్‌ యూనివర్సిటీ, ఇంగ్లండ్‌లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్‌ బాత్‌కు చెందిన శాస్త్రవేత్తలు కలిసి ఈ సరికొత్త ‘స్ప్రే’ని అభివృద్ధి చేశారు. జెల్లీ చేపలోని ‘గ్రీన్‌ ఫ్లోరసెంట్‌ ప్రొటీన్‌’తో దీన్ని చేశారట. ఈ మిశ్రమంలో గాఢమైన రసాయనాలేవీ లేకపోవడం వల్ల- వేళ్ళలోని ద్రవాలకి సంబంధించిన ‘డీఎన్‌ఏ’ కూడా చెక్కుచెదరదట. అటు వేలిముద్రలూ, ఇటు డీఎన్‌ఏలతో నేరస్థుణ్ణి మరింత వేగంగా పట్టుకోవచ్చని చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..