ఆల్జీమర్స్‌కి అనుకున్న చికిత్స ఇలా...

ఓ సమస్య నివారణకని అనుకున్న చికిత్స అనూహ్యంగా మరొకదానికి ఉపయోగ పడటం వైద్య ప్రపంచంలో అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఇది అలాంటిదే. అమెరికాలోని ‘ఎంఐటీ’లో ఆ మధ్య ఆల్జీమర్స్‌కని ఓ సరికొత్త చికిత్సని రూపొందించారు.

Published : 17 Mar 2024 00:55 IST

సమస్య నివారణకని అనుకున్న చికిత్స అనూహ్యంగా మరొకదానికి ఉపయోగ పడటం వైద్య ప్రపంచంలో అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఇది అలాంటిదే. అమెరికాలోని ‘ఎంఐటీ’లో ఆ మధ్య ఆల్జీమర్స్‌కని ఓ సరికొత్త చికిత్సని రూపొందించారు. ‘సౌండ్‌ అండ్‌ లైట్‌’ థెరపీ అంటున్నారు దీన్ని. ఇందులో భాగంగా ఆల్జీమర్స్‌ ఉన్నవాళ్ళకి ప్రత్యేక కళ్ళద్దాల్లాంటి పరికరాన్నిస్తారు. ఆ అద్దాల్లోని లైటు వెలుగుతూ ఆరిపోతూ ఉంటుంది. దాంతోపాటూ అందులో ఆగి-ఆగి వినిపించే ఓ శబ్దం కూడా వస్తుంది. ఆ వెలుగు క్షణానికి 40 సార్లు మిణుమిణుకుమంటే, శబ్దం కూడా అదే రీతిలో ఆగిపోయి మళ్ళీ వస్తూ ఉంటుంది. క్షణానికి నలభైసార్లన్న ఈ లెక్కని ‘40 హెర్జస్‌’ అంటారు. ఆల్జీమర్స్‌ ఉన్నవాళ్ళు ఓ గంటపాటు ఆ ‘40 హెర్జస్‌’ వెలుగుని చూసి, శబ్దాన్ని వింటే మెదడులో జ్ఞాపకశక్తికి కారణమైన ‘గామా’ తరంగాలు ప్రేరణకి గురవుతాయట. అలా ఆల్జీమర్స్‌ని నివారించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు. తాజాగా- ఈ ‘లైట్‌ అండ్‌ సౌండ్‌’ చికిత్స- కీమో థెరపీతో మెదడు పనితీరు బలహీనమైన వాళ్ళలోనూ పనిచేస్తున్నట్టు పసిగట్టారు. ఈ మేరకు ఎలుకల్లో ప్రయోగాలు చేసి విజయం సాధించారు. త్వరలోనే- క్లినికల్‌ ట్రయల్స్‌కీ వెళ్ళబోతున్నారట!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..