ఉమ్మనీటితో... అవయవాలు చేసేస్తారట!

గర్భిణుల్లోని ఉమ్మనీటితో ల్యాబుల్లోనే వివిధ అవయవాలకి చెందిన కణజాలాన్ని(టిష్యూ) తయారుచేసే కొత్త విధానాన్ని లండన్‌ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఈ విధానంతో ఊపిరితిత్తులు, కిడ్నీలు, చిన్న పేగుల కణజాలాన్ని సృష్టించగలుగుతున్నారు. లండన్‌లోని గ్రేట్‌ ఆర్మండ్‌ స్ట్రీట్‌ హాస్పిటల్‌కి చెందిన పాలో డి కాపి అనే శాస్త్రవేత్త ఈ కణజాలాన్ని త్రీడీలో రూపొందించారు.

Published : 17 Mar 2024 00:56 IST

ర్భిణుల్లోని ఉమ్మనీటితో ల్యాబుల్లోనే వివిధ అవయవాలకి చెందిన కణజాలాన్ని(టిష్యూ) తయారుచేసే కొత్త విధానాన్ని లండన్‌ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఈ విధానంతో ఊపిరితిత్తులు, కిడ్నీలు, చిన్న పేగుల కణజాలాన్ని సృష్టించగలుగుతున్నారు. లండన్‌లోని గ్రేట్‌ ఆర్మండ్‌ స్ట్రీట్‌ హాస్పిటల్‌కి చెందిన పాలో డి కాపి అనే శాస్త్రవేత్త ఈ కణజాలాన్ని త్రీడీలో రూపొందించారు. దీన్ని ‘ఆర్గనాయిడ్‌’ అని పిలుస్తున్నారు. ఈ ఆవిష్కరణతో భవిష్యత్తులో ఉమ్మనీటితో పూర్తిస్థాయిలో కిడ్నీలు, ఊపిరి తిత్తుల్లాంటివాటిని రూపొందించే అవకాశం ఉంది. వాటి ద్వారా గర్భస్థ శిశువులకి కూడా కిడ్నీ, ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్‌లు చేసేయొచ్చు. భవిష్యత్తు సరే- నేటి ఉపయోగమేంటీ అంటారా? కొందరు శిశువులకి గర్భంలోనే ‘కంజెనిటల్‌ డయాఫ్రమెటిక్‌ హెర్నియా’(సీడీహెచ్‌) సమస్య ఏర్పడుతుంది. వీరిలో ఎడమ ఊపిరితిత్తి చిన్నగా ఉంటుంది. ఈ సమస్యని పిండ దశలోనే వైద్యులు గుర్తిస్తున్నారు కానీ- ‘ఆ సమస్య తీవ్రత ఎంత?’ అన్నదానిపైన స్పష్టత తెచ్చుకోలేకపోతున్నారు. అదే, ఉమ్మనీటితో తయారుచేసిన ఊపిరితిత్తుల ఆర్గనాయిడ్‌తో వ్యాధి తీవ్రతని ఇట్టే చెప్పేయొచ్చట! ఇప్పటికే లండన్‌లో అలాంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలనీ మొదలుపెట్టేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..