నీటి బ్యాటరీతో స్కూటర్‌!

మొబైల్‌ఫోన్ల నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాలదాకా అన్నింటిలోనూ ఇప్పుడు లిథియం-అయాన్‌ బ్యాటరీలనే వాడుతున్నారు.

Published : 30 Mar 2024 23:47 IST

మొబైల్‌ఫోన్ల నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాలదాకా అన్నింటిలోనూ ఇప్పుడు లిథియం-అయాన్‌ బ్యాటరీలనే వాడుతున్నారు. వీటి సామర్థ్యం బాగానే ఉన్నా- అప్పుడప్పుడూ పేలిపోతుంటాయి. వాహనాల్లో ఇది పెద్ద సమస్యలకి దారితీస్తోంది. దీనికి పరిష్కారంగానే నీటితో పనిచేసే సరికొత్త బ్యాటరీలని తాజాగా ఆవిష్కరించారు ఆస్ట్రేలియాకి చెందిన శాస్త్రవేత్తలు. ప్రపంచంలో ఏ బ్యాటరీకైనా- ఆనోడ్‌ క్యాథోడ్‌ అనే రెండు ధ్రువాలుంటాయి. ఓ బ్యాటరీని రీఛార్జ్‌ చేసేటప్పుడు ఆనోడ్‌లోనూ, క్యాథోడ్‌లోనూ పుట్టే విద్యుత్తు కణాలని ఎలక్ట్రోలైట్‌ అనే రసాయనం పెంచుతుంది. ‘లిథియం’ బ్యాటరీనే తీసుకుంటే దాని ఆనోడ్‌కి లిథియంనీ, క్యాథోడ్‌కి అయాన్‌నీ వాడతారు. ఎలక్ట్రోలైట్‌గా ‘ఫాస్ఫేట్‌’ వంటి రసాయనాలను ఉపయోగిస్తారు. ఈ రసాయనాల కారణంగానే పేలుడు సంభవిస్తోంది. దీనికి పరిష్కారంగానే- ఫాస్ఫేట్‌కి బదులుగా నీరూ, సహజ లవణాలతో కూడిన ఎలక్ట్రోలైట్‌లని తయారుచేశారు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్న ఆర్‌ఎంఐటీ వర్సిటీ శాస్త్రవేత్తలు. లిథియంకు బదులు జింక్‌ క్యాథోడ్‌ని వాడారు. ఈ నీటి బ్యాటరీతో ఇటీవలే ‘ఈవీ’ స్కూటర్‌నీ నడిపి ఆశ్చర్యపరిచారు పరిశోధకులు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..