హెచ్‌ఐవీకి శాశ్వత చికిత్స!

ఇదివరకటిలా ఎయిడ్స్‌ని ఇప్పుడెవరూ ప్రాణాంతక వ్యాధిలా భావించడంలేదు, భయపడట్లేదు. హెచ్‌ఐవీ పాజిటివ్‌ వచ్చినవాళ్ళు రోజూ యాంటీ రెట్రోవైరల్‌ థెరపీ(ఏఆర్‌టీ)తో అందరిలాగే జీవిస్తున్నారు.

Published : 30 Mar 2024 23:48 IST

దివరకటిలా ఎయిడ్స్‌ని ఇప్పుడెవరూ ప్రాణాంతక వ్యాధిలా భావించడంలేదు, భయపడట్లేదు. హెచ్‌ఐవీ పాజిటివ్‌ వచ్చినవాళ్ళు రోజూ యాంటీ రెట్రోవైరల్‌ థెరపీ(ఏఆర్‌టీ)తో అందరిలాగే జీవిస్తున్నారు. కానీ- ఈ మందులు వాడటం ఆపేస్తే వాళ్ళ శరీరంలో ఉన్న వైరస్‌ మళ్ళీ నిద్ర లేచి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఎందుకిలా జరుగుతుందంటే- ఎయిడ్స్‌ కారక హెచ్‌ఐవీ మనకి సోకినప్పుడే కొన్ని వైరస్‌లు రోగనిరోధక కణాల్లోని డీఎన్‌ఏలోకి వెళ్ళిపోతాయి. అక్కడ నిద్రాణంగా ఉండిపోతాయి. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడగానే శక్తిని పుంజుకుంటాయి. అందుకే నిద్రాణంగా ఉన్న వైరస్‌ని శాశ్వతంగా నాశనం చేసే విధానం కోసం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అందులో తాజాగా- పరిశోధకులకి అందివచ్చింది ‘క్రిస్పర్‌’ విధానం! మానవ శరీరంలోని జన్యువులని మన అవసరం మేరకు ‘ఎడిట్‌’ చేసే సరికొత్త పద్ధతి ఇది. ఇప్పటికే దీనితో సికిల్‌ సెల్‌ అనీమియా వంటి సమస్యలకి శాశ్వత పరిష్కారం సాధించేశారు. అదే ఊపులో ఇప్పుడు ఎయిడ్స్‌పైనా దృష్టిపెట్టారు. రోగనిరోధక కణాల్లో ఉన్న డీఎన్‌ఏని- తనలో నిద్రాణమై ఉన్న వైరస్‌ని పసిగట్టి అంతమొందించేలా క్రిస్పర్‌తో ఎడిట్‌ చేయొచ్చని నిరూపించారు నెదర్లాండ్స్‌లోని అమ్‌స్టర్‌డామ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ప్రస్తుతానికి పరిశోధనాశాలకే పరిమితమైన ఈ ప్రయోగాన్ని అతిత్వరలోనే జంతువులపైనా నిర్వహిస్తామని చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..