గుండె చికిత్సకి యాంటీబయాటిక్స్‌?!

గుండెపోటు వచ్చి బతికి బయటపడిన కొందరిలో హృదయం పనితీరు మందగిస్తుంది. అంటే- శరీరానికి అవసరమైన మేరకు రక్తాన్ని సరఫరా చేయలేక గుండె ఆపసోపాలు పడుతుంటుంది.

Published : 30 Mar 2024 23:50 IST

గుండెపోటు వచ్చి బతికి బయటపడిన కొందరిలో హృదయం పనితీరు మందగిస్తుంది. అంటే- శరీరానికి అవసరమైన మేరకు రక్తాన్ని సరఫరా చేయలేక గుండె ఆపసోపాలు పడుతుంటుంది. దీన్నే ‘హార్ట్‌ ఫెయిల్యూర్‌’ అంటుంటారు. ‘స్ట్రోక్‌’ వల్ల గుండెలోని కండరాలు దెబ్బతినడం ఇందుకు కారణం. ఈ సమస్యే పెరిగి గుండె ఆగిపోయే(హార్ట్‌ స్టాపింగ్‌) ప్రాణాపాయకర స్థితిగానూ పరిణమిస్తుంది. హార్ట్‌ఫెయిల్యూర్‌కి హృదయమార్పిడి ఒక్కటే పరిష్కారంగా ఇప్పటిదాకా భావిస్తూ వస్తున్నారు. కానీ- ఈ సమస్యకి మామూలు యాంటీబయాటిక్స్‌తోనూ విరుగుడు ఉండొచ్చని నిరూపించారు అమెరికాలోని టెక్సాస్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు. గుండెలో దెబ్బతిన్న కణజాలం(టిష్యూలు) మళ్ళీ ఎదగకుండా మీస్‌1, హాక్స్‌బి13 అనే ప్రొటీన్‌లు అడ్డుకుంటున్నాయని ఇదివరకే శాస్త్రవేత్తలు కనిపెట్టారు. తాజగా పారామోమైసిన్‌, నియోమైసిన్‌ అనే రెండు యాంటీబయాటిక్‌ మందులు ఇందుకు ఉపయోగపడతాయని పసిగట్టారు పరిశోధకులు. ఇవి రెండూ ఇదివరకే వాడకంలో ఉన్న ఔషధాలే. వీటిని ‘హార్ట్‌ ఫెయిల్యూర్‌’తో బాధపడుతున్న పందులకి వాడితే- వాటి కణజాలం పునర్నిర్మాణం(రీజనరేటింగ్‌) కావడం గమనించారు శాస్త్రవేత్తలు. అలా, వాటి గుండె సామర్థ్యమూ బాగా పెరిగిందట. కాబట్టి, ఇది మనుషుల్లోనూ పనిచేసే అవకాశాలు మెండని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు శాస్త్రవేత్తలు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు